Begin typing your search above and press return to search.

నాని కొత్త సినిమా మొదలైపోయింది

By:  Tupaki Desk   |   18 Feb 2019 7:03 AM GMT
నాని కొత్త సినిమా మొదలైపోయింది
X
న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది మంచి ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి పక్కాగా పూర్తి చేసుకుంటూ గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇటీవలే జెర్సి ఫినిష్ చేసిన నాని చిన్న గ్యాప్ తర్వాత కొత్త సినిమా సెట్ లోకి అడుగు పెట్టేసాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే కొత్త సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ఇందాకా మొదలైంది. కొరటాల శివతో పాటు శరత్ మరార్ అతిధులుగా విచ్చేసి సింపుల్ గా కానిచ్చేశారు.

రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి జరగనుంది. ఇది రొమాంటిక్ డ్రామాగా ఉంటుందని ఇన్ సైడ్. ఐదుగురు స్త్రీలతో ముడిపడిన హీరో లైఫ్ ని విక్రమ్ కుమార్ తనదైన స్క్రీన్ ప్లే మేజిక్ తో సరికొత్తగా ఆవిష్కరించబోతున్నట్టు వినికిడి. నానికి ఇది 24వ సినిమా. షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదలకు ప్లాన్ చేసినట్టు సమాచారం. హీరోయిన్లు ఎవరు టెక్నీకల్ టీమ్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నాని రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఊహించని మలుపులతో కొత్త అనుభూతిని ఇస్తుందని యూనిట్ సమాచారం. నాని పాత్ర తీరుతెన్నులు సస్పెన్స్ లో ఉంచుతున్నారు. ఇష్క్-మనం-24 లాంటి విభిన్నమైన సినిమాలతో అలరించిన విక్రమ్ కుమార్ కు హలో చిన్న షాక్ ఇచ్చినప్పటికీ దాన్నుంచి ఏడాది గ్యాప్ తీసుకుని ఇది రెడీ చేసారు. మధ్యలో బన్నీ ప్రాజెక్ట్ డ్రాప్ అయినప్పటికీ నానితో మరోసారి పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు విక్రమ్ కుమార్.