Begin typing your search above and press return to search.

నిక్ నేమ్ బాబుల.. రిజల్ట్ ఏంటో

By:  Tupaki Desk   |   12 Feb 2016 5:30 AM GMT
నిక్ నేమ్ బాబుల.. రిజల్ట్ ఏంటో
X
ఇవాళ రెండు సినిమాల రిలీజ్. లో బడ్జెట్ హీరో స్థాయి నుంచి స్టార్ రేంజ్ కి ఒకేసారి వెళ్లిపోయిన నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ ఒకటైతే.. డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి కుదురుకోవడానికి కష్టపడుతున్న ఆది నటించిన గరం మూవీ మరొకటి. నాని గత సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కాస్త ఎక్కువే ఖర్చు చేశారు. అలాగే సొంత సినిమా అవడంతో.. ప్రెస్టీజియస్ గా తీసుకుని ఆది కోసం కూడా బాగానే వెచ్చించారు.

ఇప్పుడు కృష్ణగాడి వీర ప్రేమగాధతో - గరం.. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. రెండూ వేటికవే డిఫరెంట్ జోనర్. సినిమాలో సత్తా ఉంటే నాలుగు సినిమాలైనా హిట్ అయిపోతాయని రీసెంట్ గానే ప్రూవ్ అయింది కాబట్టి.. ఆ విషయంలో టెన్షన్ అక్కర్లేదు. కానీ.. కంటెంట్ విషయంలోనే ఎవరి కంగారు వాళ్లకి ఉంటుంది. ఇరవై ఏళ్లుగా ఇలాంటి కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో సినిమా రాలేదని అంటున్నాడు కానీ.. అంతకు ముందు వచ్చినదైతే పాత చింతకాయలా ఉంటుంది. ఇక మాస్ మసాలా ఎంటర్టెయినర్ కు.. మతాంతర ప్రేమని మిక్స్ చేశాడు ఆది.

మొత్తానికి ఇద్దరు నిక్ నేమ్ బాబులు ఒకేసారి పోటీ పడుతున్నారు. గంటా నవీన్‌ బాబు ఎలియాస్‌ నాని.. ఆదిత్య పూడిపెద్ది ఎలియాస్‌ ఆదిలలో మరి హిట్ ఎవరు కొడతారో.. విన్నర్ గా ఎవరు నిలుస్తారో?