Begin typing your search above and press return to search.

రెండు పాత్రల్లో మూడోసారి!!

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:47 AM GMT
రెండు పాత్రల్లో మూడోసారి!!
X
నేచురల్ స్టార్ నాని సినిమాల వేగం మరికాస్త పెంచాడు. తన యాక్టింగ్ టాలెంట్ తో నేను లోకల్ లాంటి రొటీన్ స్టోరీతో కూడా మంచి హిట్ కొట్టి తన మార్కెట్ పెంచుకున్నాడు. ఈ ఊపుతో తర్వాత సినిమాలు చకచకా చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. ప్రస్తుతం నాని చేసిన లేటెస్ట్ సినిమా నిన్ను కోరి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా జులై 7న రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో జెంటిల్ మేన్ లో నానికి జంటగా నటించిన నివేదా థామస్ హీరోయిన్ గా నటించనుంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ - ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో వరస హిట్లు కొట్టిన మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో నటించేందుకు నాని పచ్చజెండా ఊపాడు. ఈ సినిమాలో నాని మరోసారి డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. జెండాపై కపిరాజు - జెంటిల్ మేన్ మూవీల్లో ఇంతకుముందు నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రెండు పాత్రల్లో అలరించబోతున్నాడు. మేర్లపాక గాంధీ గత సినిమాలలాగే ఈ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కనుంది.

నాని ప్రస్తుతం ఎంసీఏ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మళయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ నాటికి థియేటర్లకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఎంసీఏ షూటింగ్ పూర్తయిన వెంటనే మేర్లపాక గాంధీ సినిమా స్టార్ట్ చేయనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/