Begin typing your search above and press return to search.

నందూ టార్గెట్ ఈసారైనా తీరేనా

By:  Tupaki Desk   |   23 Jun 2018 1:30 AM GMT
నందూ టార్గెట్ ఈసారైనా తీరేనా
X
బిగ్ బాస్ 2 లో తన డామినేషన్ తో అందరిని ఆకట్టుకుంటున్న పార్టిసిపెంట్ కం సింగర్ సింగర్ గీతా మాధురి భర్త నందూ హీరోగా చేస్తూనే మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఈ మధ్య వచ్చిన కూల్ హిట్ సమ్మోహనంలో అదితితో పాటు సినిమా హీరో పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసిన నందు గతంలో కూడా పెళ్లి చూపులు లాంటి హిట్ మూవీస్ లో చిన్న పాత్రలతో సక్సెస్ లో తన వంతు షేర్ బాగానే ఇచ్చాడు. కానీ నందూకి హీరోగా సెటిల్ అవ్వాలని లక్ష్యం. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. గత ఏడాది కాలంలో నందు హీరోగా చేసిన మూవీస్ నాలుగు దాకా వచ్చాయి అంటే ఆశ్చర్యం వేయక మానదు. కాకపోతే ఏది కూడా థియేటర్లలో పట్టుమని వారం కూడా నిలవలేదు. అందుకే ఈ సారి ఇంకాస్త గట్టిగా చేద్దామని కాబోలు ఈ నెల 29న విడుదల కానున్న కన్నుల్లో నీ రూపమేతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

బిక్స్ అనే డెబ్యూ డైరెక్టర్ తీసిన ఈ మూవీ విడుదల గత నాలుగైదు నెలలుగా వాయిదా పడుతూ ఫైనల్ గా డేట్ లాక్ చేసుకుంది. కన్నడ భామ తేజస్విని హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ మూవీ ట్రైలర్ ఆల్బమ్ ఆరు నెలల క్రితమే విడుదలయ్యాయి. సాకేత్ ట్యూన్స్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. సాఫ్ట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ మూవీలో ఊహించని అంశాలు ఉంటాయని దర్శకుడు చెబుతున్నాడు. ట్రైలర్ లో చూచాయగా హారర్ అంశాలు కూడా ఉన్నట్టు చూపించారు. మరి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న నందూకు ఈ మూవీ బ్రేక్ ఇవ్వాలని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గీతా మాధురి కూడా కోరుకుంటూ ఉంటుంది. ఈ టైటిల్ నాగ్ ఫాన్స్ కే కాదు మ్యూజిక్ లవర్స్ కు బాగా కనెక్ట్ అయ్యేది. నిన్నే పెళ్లాడతా సినిమాలో ఎవర్ గ్రీన్ మెలోడీని టైటిల్ గా పెట్టుకున్న నందూ దీంతో బ్రేక్ వస్తే మరిన్ని అవకాశాలతో హీరోగా సెటిల్ అయ్యే ప్లాన్ లో ఉన్నాడు. తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందితో పోటీ పడుతున్న కన్నుల్లో నీ రూపమే వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.