Begin typing your search above and press return to search.

తెలుగు పిల్ల భలే లక్కీ సుమండీ

By:  Tupaki Desk   |   6 May 2016 9:30 AM GMT
తెలుగు పిల్ల భలే లక్కీ సుమండీ
X
తెలుగు ఫిలింస్‌ లో అసలు తెలుగు అమ్మాయిలు ఎక్కడ కనిపిస్తున్నారు. వేరే ఏ బాషలో చూసుకున్నా కూడా.. అక్కడ నేటివ్‌ అమ్మాయిలే వారి సినిమాల్లో స్టార్‌ హీరోయిన్లుగా మెలుగుతున్నారు. కాని మన దగ్గర మాత్రం స్టార్‌ హీరోయిన్‌ అనే మాటను పక్కనెట్టేయాల్సిందే. ఏదో చిన్న సినిమాల్లో హీరోయిన్లుగా మన తెలుగమ్మాయిలు దర్శనమిస్తున్నారు.

ఏదో మొన్ననే ఒక పెద్ద స్టార్‌ బన్నీ.. తెలుగమ్మాయి అంజలిని హీరోయిన్‌ గా పెట్టుకున్నాడు. ఇక తెలుగు పిల్లల్లో ఎక్కువగా రాణిస్తోంది అంటే ఈ మధ్య కాలంలో నందిత అనే చెప్పాలి. మొన్ననే అమ్మడి సావత్రి సినిమా రిలీజైంది. ఇప్పుడేమో నిఖిల్‌ తో ఒక సినిమా వస్తోంది. అది కాకుండా ఇప్పుడు అమ్మడి చేతిలో మరో దిమ్మతిరిగే ఆఫర్‌ వచ్చిపడింది. సందీప్‌ కిషన్‌ హీరోగా కృష్ణవంశీ రూపొందిస్తున్న సినిమాలో.. రెజీనా లీడ్‌ రోల్‌ చేస్తుంటే.. మరో లీడ్‌ గా నందితను ఎన్నుకున్నారట. అచ్చమైన తెలుగమ్మాయి రోల్‌ నే తెరపై కూడా చేయనుందట నందిత.

అసలే కృష్ణవంశీ సినిమాల్లో చేస్తే చాలామంది హీరోయిన్ల ఫేట్‌ అమాంతం తిరిగిపోతుంది. మరి నందితకు కూడా గుడ్‌ డేస్‌ స్టార్ట్ అవుతాయేమో చూడాలి. ఏదేమైనా కృష్ణవంశీ సినిమా కొట్టేయడం అంటే.. ఈమెను భలే లక్కీ సుమండీ అనుకోవాల్సిందే.