లవ కుశ కథలో దెయ్యం పిల్ల

Fri Apr 21 2017 10:56:11 GMT+0530 (IST)

జై లవ కుశ.. ప్రస్తుతం నందమూరి అభిమానులు చేస్తున్న జపం ఇదే. జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణకు.. జై లవ కుశ టైటిల్ కూడా ఓ స్లోగన్ మాదిరిగా భలే సెట్ అయింది. ఈ చిత్రంపై జనాల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నా.. దర్శకుడు బాబీ బాగానే అర్ధం చేసుకున్నాడు. సినిమా స్థాయిని అంతకంతకూ పెంచుతూనే ఉన్నాడు.

ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో డైరెక్టర్ తీసుకుంటున్న స్టెప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. అంచనాలు పెంచేస్తున్నాయి. జై లవ కుశలో రాశి ఖన్నా హీరోయిన్ అంటూ షూట్ స్టార్ట్ చేసి.. రీసెంట్ గా నివేదా థామస్ పేరు అనౌన్స్ చేశారు. ఇక హంసా నందినితో ఓ పాటతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారట. ఇప్పుడు ప్రేమ కథా చిత్రంలో దెయ్యంగా అలరించిన నందితా రాజ్ ను ఓ కీలక పాత్రకు తీసుకున్నారట. చిన్న రోల్ అయినా.. ఈమె పాత్ర బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇప్పటికే నందితా రాజ్ తో షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసేశారట కూడా.

ఇంత మంది అమ్మాయిలతో పాటు ఓ స్టార్ హీరోయిన్ తో కేమియో కంటే కాస్త పెద్ద రోల్ చేయించనున్నారనే టాక్ ముందు నుంచి ఉంది. జై లవ కుశ మూవీని.. హీరోయిన్లతో ముంచెత్తుతుండడం చూస్తే.. కేరక్టరైజేషన్ విషయంలో బాబీ ఎంత జాగ్రత్తగా ఉన్నాడో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/