Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: నర్సింగ్ హోంలో నవ్వుల్ నవ్వుల్

By:  Tupaki Desk   |   28 Sep 2016 5:38 AM GMT
ట్రైలర్ టాక్: నర్సింగ్ హోంలో నవ్వుల్ నవ్వుల్
X
చడీచప్పుడు లేకుండా షూటింగ్ చేసుకుని సడెన్ గా వార్తల్లోకి వచ్చింది ‘నందిని నర్సింగ్ హోం’ సినిమా. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా ఇది. నిత్య, శ్రావ్య కథానాయికలుగా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు పీవీ గిరి రూపొందించాడు. రాధాకిషోర్.. భిక్షమయ్య నిర్మించారు. ఈ సినిమా ఆడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ అయింది.

ఇది నందిని నర్సింగ్ హోం చుట్టూ కథ కాబట్టే ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు. ఈ నర్సింగ్ హోంలో హీరో డాక్టర్ వేషం వేసుకుని వస్తాడు. అక్కడ పేషెంట్ల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. అతడి అసిస్టెంట్ అయిన షకలక శంకర్ కూడా జాదూనే. వీరి బాధితుడిగా వెన్నెల కిషోర్ కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ట్రైలర్లో వీరి మధ్య సన్నివేశాలు చూస్తుంటేనే హిలేరియస్ అనిపిస్తున్నాయి.

ముందు కామెడీతో మొదలుపెట్టి.. ఆ తర్వాత రొమాంటిక్ ట్రాక్ ఎక్కింది ట్రైలర్. ఇద్దరు హీరోయిన్లతో హీరో రొమాన్స్ చూపించి.. ఆ తర్వాత ట్విస్టిచ్చారు. హీరో హీరోయిన్ ట్రాప్ లో పడి ఇబ్బంది పడేలా చూపించారు. ద్వితీయార్ధం కొంచెం సీరియస్ గా సాగేలా కనిపిస్తోంది. మొత్తంగా ట్రైలర్ అయితే ఆసక్తికరంగానే అనిపిస్తోంది. మరి సినిమా ఎలాంటి ఫీలింగిస్తుందో చూడాలి. అక్టోబర్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/