Begin typing your search above and press return to search.

కొత్త కుర్రాడు టీజర్ తో వచ్చాడు

By:  Tupaki Desk   |   27 Sep 2016 5:20 AM GMT
కొత్త కుర్రాడు టీజర్ తో వచ్చాడు
X
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో నవీన్ విజయ్ కృష్ణ. సీనియర్ నటుడు నరేష్ కొడుకీ కుర్రాడు. హీరోగా ఎప్పుడో అరంగేట్రం చేయాల్సింది. కానీ అతడి తొలి సినిమా మొదలై.. మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత నవీన్ హీరోగా ‘నందిని నర్సింగ్ హోమ్’ అనే సినిమా తెరమీదికి వచ్చింది. సైలెంటుగా సినిమాను పూర్తి చేసి.. విడుదలకు రెడీ చేసేశారు. మంగళవారమే ‘నందిని నర్సింగ్ హోమ్’ ఆడియో విడుదల కాబోతోంది. మహేష్ బాబు ముఖ్య అతిథిగా ఆడియో వేడుక జరగబోతోంది. ఆ వేడుక కంటే ముందు ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.

అర నిమిషం నిడివి ఉన్న టీజర్ చూస్తే సినిమా మీద పెద్ద ఐడియా ఏమీ రావట్లేదు. ‘‘అమ్మాయి సముద్రం లాంటిదిరా.. కవ్విస్తుంది మురిపిస్తుంది’’ అంటూ హీరో చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలై.. అలా డైలాగులతోనే సాగుతుంది. నవీన్ వాయిస్ బాగుంది. మెచ్యూర్డ్ గా అనిపిస్తోంది. కొంచెం సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉన్న ముక్కోణపు లవ్ స్టోరీలాగా అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. ఇందులో ‘లవ్ యు బంగారం’ ఫేమ్ శ్రావ్యతో పాటు నిత్య అనే అమ్మాయి కథానాయికలుగా నటిస్తున్నారు. కొత్త దర్శకుడు పీవీ గిరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రాధా కిషోర్.. భిక్షమయ్య నిర్మిస్తున్నారు. అచ్చు సంగీతాన్నందిస్తున్నాడు. ‘జనతా గ్యారేజ్’కు ‘ఇచట అన్ని రిపేర్లూ చేయబడును’ అని పెట్టినట్లు.. ‘నందిని నర్సింగ్ హోమ్’కు ‘ఇక్కడ అంతా క్షేమం’ అనే ట్యాగ్ లైన్ జోడించారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/