ట్రెండింగ్: బోయపాటి ఐన్ స్టీన్!?

Fri Jan 11 2019 13:45:37 GMT+0530 (IST)

అవును .. బోయపాటి ఒక ఐన్ స్టీన్. థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టాడు. బల్బ్  మాత్రమే కాదు.. అణు విద్యుత్ ని అణుబాంబ్ ని కనిపెట్టాడు. థియేటర్లలోనే ఇవన్నీ ఆవిరి పుట్టిస్తున్నాయి.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటిపై పంచ్ లు ఇవి. బోయపాటి శ్రీను ఫోటోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఫోటోతో జాయింట్ చేసి మరీ యాంటీ ఫ్యాన్స్ సోషల్ ప్లాట్ ఫామ్ లో ప్రచారం చేయడం చర్చకొచ్చింది.నేడు ప్రపంచవ్యాప్తంగా `వినయ విధేయ రామ` రిలీజై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాపై తీవ్ర మైన పంచ్ లే పడుతున్నాయి.  నందమూరి- మెగా అభిమానుల మధ్య క్లాషెస్ పుణ్యమా అని సోషల్ మీడియా రచ్చ మామూలుగా లేదు. ఇదివరకూ బాలయ్య కథానాయకుడు సినిమా రిలీజ్ సమయంలో మెగా ఫ్యాన్స్ ఓ థియేటర్ వద్ద టిక్కెట్టు కొని ఫ్యాన్స్ కి పంచుతూ చేసిన రచ్చకు ప్రతీకారం తీర్చుకోవడం చర్చకొచ్చింది.

ఓ యాంటీ ఫ్యాన్ ఏకంగా `వినయ విధేయ రామ` థియేటర్ లో ఓ వీడియోని కాప్చర్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. ఒబెరాయ్ అండ్ గూండా గ్యాంగ్స్ తలలు నరుకుతున్న మెగా పవర్ స్టార్ చరణ్ వీడియోని పోస్ట్ చేసి బోయపాటి పై విరుచుకుపడ్డారు కొందరైతే. ఎంత విరోచితమైన పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించినా తలకాయలు మరీ ఇలా పుచ్చకాయల్లా గాల్లో ఎగిరిపడడం ఏంటో! అంటూ పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్నారు. మొత్తానికి బోయపాటికి సూటు తొడిగి ఐన్ స్టీన్ అంటూ చాలానే కామెడీ చేస్తున్నారు. ఇ = ఎంసీ స్క్వేర్.. అంటే రెండు తలలు గాల్లో లేచి రాకెట్ లా పయనించును.. దీని ప్రచారంలో ఫ్యాన్స్ ఒరవడికి ఇదో పరాకాష్ట.