స్పెషల్ స్క్రీనింగ్.. నందమూరి ఫ్యామిలీ హ్యాపీస్

Tue Jan 10 2017 14:33:58 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలకు మరొక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండండతో.. ఫ్యాన్స్ హంగామా పీక్ స్టేజ్ లో ఉంది. యుద్ధవీరుడిగా బాలకృష్ణ అభినయాన్ని ఆద్యంతం ఎంజాయ్ చేసేందుకు టాలీవుడ్ ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. అయితే.. సినిమా థియేటర్స్ లోకి ఈ నెల 12న రానున్న గౌతమిపుత్ర శాతకర్ణిని.. తన కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు బాలకృష్ణ.

గత రాత్రి రామానాయుడు స్టూడియోస్ లో శాతకర్ణిని ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీనికి బాలకృష్ణతో పాటు.. వసుంధర.. నారా లోకేష్.. బ్రాహ్మణి.. తేజస్విని.. భరత్.. బెళ్లారి సాయి.. బిబో శ్రీనివాస్ లతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారట. మొత్తం మూవీ అంతా పూర్తయ్యే సరికి ఆడిటోరియం అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో బాలయ్య నటనకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వశిష్టీ దేవిగా శ్రియ నటనకు అందరూ అబ్బురపడ్డారని అంటున్నారు.

తెలుగు వాడి ఘనకీర్తిని దిగంతాలకు చాటిచెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృత తెలుగు ప్రేక్షకులలో కనిపిస్తోంది. శాతకర్ణి చిత్రానికి.. ఈ మూవీలోని యుద్ధ సన్నివేశాలే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. తెలుగు చలన చిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం అనే మాట ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/