Begin typing your search above and press return to search.

బాబుతో బాలయ్య ఫోటో!

By:  Tupaki Desk   |   28 Nov 2017 4:59 AM GMT
బాబుతో బాలయ్య ఫోటో!
X
విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన మోహన్ బాబు.. కొంత కాలంగా సినిమాల విషయంలో నెమ్మదించారు. సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో నచ్చితే మినహాయిస్తే.. సినిమా చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం గాయత్రి అనే చిత్రంలో మోహన్ బాబు నటిస్తున్నారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. రీసెంట్ గా ఈ చిత్రం టైటిల్ లోగో కూడా విడుదల చేశారు.

ఇప్పుడీ గాయత్రి మూవీ షూటింగ్ స్పాట్ కి సడెన్ ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. మోహన్ బాబు-బాలయ్యల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. గాయత్రి షూటింగ్ స్పాట్ కు వచ్చిన బాలయ్య.. మోహన్ బాబుతోను ఆయన కుటుంబ సభ్యులతోను చాలాసేపు గడిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ-మోహన్ బాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మంచు విష్ణు. అంతే కాదు.. గాయత్రి చిత్రానికి సంబంధించి మరో కొత్త విషయం కూడా తెలిపాడు విష్ణు.

'గాయత్రి షూటింగ్ లో ఇవాల్టి నుంచి పాల్గొంటున్నాను. మా అన్నయ్య.. నాకు ఎంతగానో ఇష్టమైన అద్భుతమైన వ్యక్తి బాలకృష్ణ సెట్ కు వచ్చి ఆశీర్వదించారు' అని చెప్పాడు మంచు విష్ణు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్. మాధవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.