Begin typing your search above and press return to search.

రజనీకాంత్ కాదు...సినిమాయే సూపర్ స్టార్!

By:  Tupaki Desk   |   27 July 2016 10:33 AM GMT
రజనీకాంత్ కాదు...సినిమాయే సూపర్ స్టార్!
X
భారతదేశంలో - ముఖ్యంగా దక్షిణాదిలో కమల్ హాసన్ - చిరంజీవి - మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు - గొప్ప నటనను కలిగి ఉన్నా... రజనీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ కచ్చితంగా ప్రత్యేకమైందే. కబాలీ సినిమాని కేరళలో మోహన్ లాల్ విడుదల చేసారంటేనే.. రజనీకి ఉన్న ఫాలోయింగ్ అర్ధమవుతోంది. ఈ స్థాయిలో రజనీ ఫాలోయింగ్ ప్రపంచం మొత్తం ఒక సునామీ అనే చెప్పుకోవాలి. తాజాగా విడుదలయిన కబాలి సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా.. కలెక్షన్స్ లో ముఖ్యంగా ఓవర్సీస్ కలెక్షన్స్ లో దుమ్ములేపుతోందనే విషయం కచ్చితంగా రాజనీ స్టామినా - ఫాలోయింగ్ తాలూకు ప్రతిఫలమే. ఈ స్థాయిలో దూసుకుపోతున్న కబాలి గురించి - సూపర్ స్టార్స్ గురించి నానా పటేకర్ డిఫరెంట్ గా స్పందించారు.

తాజాగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో నానా పటేకర్ ని కబాలి గురించి ప్రశ్నించగా.. ఆయన షాకింగ్ సమాధానం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆ షాకింగ్ సమాధానం ఆయన మాటల్లోనే... "నా వరకూ భారతదేశంలో సినిమాయే సూపర్ స్టార్. ప్రత్యేకించి ఏ నటుడూ సూపర్ స్టార్ కాదు. ఎందుకంటే.. ఏ సూపర్ స్టార్ లేకపోయినా, సరైన కథతో వచ్చిన చిన్న చిన్న సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. ఇదే క్రమంలో పేళవమైన కథతో వచ్చిన సూపర్ స్టార్స్ సినిమాలు కూడా మూడురోజుల్లో థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి"!! ఈ రేంజ్ లో నానాపటేకర్ స్పందించారు.

నానాపటేకర్ చెప్పినవి వాస్తవదూరం కాకపోయినా.. భారతదేశంలో స్టార్ లకు - సూపర్ స్టార్లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు వారికోసం గుడులు కడతారు - సినిమా విడుదలకు ప్రత్యేక పూజలు చేస్తారు - కటౌట్ లకు పాలాభిషేకాలూ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో నానాపటేకర్ మాటలు స్టార్ల అభిమానులకు చేదుగా అనిపిస్తాయి.