Begin typing your search above and press return to search.

ముంబైలో నమ్రత శిరోద్కర్‌ ప్రొడ‌క్ష‌న్?

By:  Tupaki Desk   |   26 Nov 2015 5:34 AM GMT
ముంబైలో నమ్రత శిరోద్కర్‌ ప్రొడ‌క్ష‌న్?
X
ప్రిన్స్ మహేష్ ముంబైలో ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌ లో ఓ ఇల్లు ఉండ‌గా, ముంబై న‌గ‌రంలో మ‌రో ఇల్లు కొనుక్కోవ‌డం వెన‌క అస‌లు మ‌త‌ల‌బు ఏంటి? అన్న‌ది ర‌క‌ర‌కాల సందేహాల‌కు తావిచ్చింది. ఒక‌వేళ మ‌హేష్ బాలీవుడ్ సినిమాల్లో న‌టించేందుకు రెడీ అవుతున్నాడా? అన్న ప్ర‌శ్న వ‌చ్చింది. దీనికి స‌మాధానం కోరితే అట్నుంచి వ‌చ్చిన ఆన్స‌ర్ ఇంట్రెస్టింగ్‌.

వాస్త‌వానికి న‌మ్ర‌త శిరోద్క‌ర్ స్వ‌స్థ‌లం ముంబై. మ‌హేష్‌ ని పెళ్లాడాక హైద‌రాబాద్‌ లో ఉంటోంది. కానీ ఏదైనా ఎసైన్‌ మెంట్స్ ప‌నిమీద మ‌హేష్‌ తో క‌లిసి ముంబై వెళ్లాల్సి వ‌స్తే ఎక్క‌డ ఉండాలి? ప‌్ర‌తిసారీ అక్క శిల్ప ఇంటికి వెళ్లి వాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌డం క‌రెక్టు కాదు క‌దా? పైగా అక్క‌డ హోట‌ళ్ల‌లో బ‌స చేయాల్సి వ‌స్తే అది సొంత ఇంట్లో ఉన్న ఫీల్‌ ని ఇవ్వ‌దు క‌దా! అంతేనా సొంతంగా ఏదైనా ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప్రారంభించి ఏదైనా ఏజెన్సీతో మంత‌నాలు సాగించాల‌న్నా నెల‌ల త‌ర‌బ‌డి ముంబైలో స్టే చేయాల్సి ఉంటుంది. దాని వ‌ల్ల దుబారా కూడా పెరిగిపోతోంది.

అలాంట‌ప్పుడు మ‌న‌కంటూ ఓ ఇల్లు ఉంటే బావుంటుంది క‌దా.. అన్ని ర‌కాలా సౌక‌ర్యంగా ఉంటుంది. ఫిట్‌ నెస్ కోసం ఓ ప్ర‌త్యేక‌మైన జిమ్‌ ని అందులో ఏర్పాటు చేసుకోవ‌చ్చు... అని ప్రిన్స్ ఫ్యామిలీ భావించిందిట‌. అందుకే వెంట‌నే ఇల్లు కొనుక్కున్నార‌ని తెలుస్తోంది. సర్లేండి.. అసలు మన సూపర్‌ స్టార్ రేంజుకు సరదాగా ముంబయ్‌ లో ఒక ఇల్లు కొనుక్కున్నా పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదు.