నమ్రత.. వాటే క్లిక్!!

Thu Sep 14 2017 12:47:06 GMT+0530 (IST)

సౌత్ లోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో మహేష్. ఈ మధ్య పరభాషా అభిమానులను కూడా సూపర్ స్టార్ బాగా ఆకర్షిస్తున్నాడు. ఎప్పుడు ఏ వివాదాల్లోకి వెళ్లకుండా సినిమాలతో ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. టాలీవుడ్ లో ఎంత మంది స్టార్స్ ఉన్నా నలుగురు చేయని సినిమాలనే చేస్తున్నాడు. ఇక మహేష్ ఫ్యామిలీ లైఫ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒక్కసారైనా తన కుటుంబంతో గడిపే తీరతాడు.

ఇక ఆయన భార్య నమ్రత పెళ్లి అవ్వగానే సినిమాలకి ఎండ్ చెప్పి కుటుంబమే తన ప్రపంచం అనేలా మంచి ఇల్లాలిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే వీరిద్దరు ఎంత పెద్ద సెలబ్రెటీలు అయినా చాలా సింపుల్ గా ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. రీసెంట్ గా నమ్రత.. మహేష్ షూటింగ్ కి వచ్చింది. ఒక యాడ్ సీన్ లో మహేష్ బిజీగా ఉన్నాడు. అక్కడకి నమ్రత కూడా వచ్చి ఊహించని విధంగా కెమెరా ముందు దొరికిపోయింది. మహేష్ షూటింగ్ అయిపోగానే ఫ్యాకప్ చెబుతున్న సమయంలో  ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ నమ్రత ని సడన్ గా ఓ ఫొటో తీశాడు. మంచి స్టిల్ తో ఉన్న నమ్రత ఫొటోలో చాలా అందంగా ఉంది కదూ.

ఇక మహేష్ మొత్తానికి స్పైడర్ ను పూర్తి చేసి ప్రస్తుతం కొన్ని యాడ్స్ ను చేస్తున్నాడు. స్పైడర్ రిలీజ్ తర్వాత ఇంతకుముందు కొరటాల శివతో మొదలు పెట్టిన భారత్ అనే నేను షూటింగ్ ను కంటిన్యూ చేయనున్నాడు.