Begin typing your search above and press return to search.

మిసెస్ మహేష్ పర్ఫెక్ట్ రోల్

By:  Tupaki Desk   |   18 Jun 2019 8:48 AM GMT
మిసెస్ మహేష్ పర్ఫెక్ట్ రోల్
X
సినిమా హీరోల లైఫ్ పార్టనర్స్ తమ భర్తల వృత్తిపరమైన వ్యవహారాల్లో యాక్టివ్ గా ఉండటం చాలా అరుదుగా చూస్తుంటాం. ఉంటే హౌస్ వైఫ్ గానో లేదా ఇతర వ్యాపారాల్లో ఎంగేజ్ కావడం సహజం. చెప్పుకోవడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాని ప్రిన్స్ మహేష్ భార్యామణి నమ్రతా శిరోద్కర్ మాత్రం ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని మహేష్ తరఫున సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన రెగ్యులర్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూనే ఉంటారు.

అంతే కాదు మహేష్ మూవీస్ తాలుకు ప్రొడక్షన్ రెమ్యునరేషన్ తదితర డీలింగ్స్ అన్ని తనే చూసుకుంటూ మహేష్ ని పూర్తిగా నటన వైపే ఫోకస్ పెట్టేలా తోడుండబట్టే ఇన్ని సక్సెస్ లు తమ హీరో సాధించాడని అబిమానులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా మహేష్ స్పాన్సర్ చేస్తున్న లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో పాటు ఆంధ్ర డాక్టర్స్ సంఘం కలిసి అవసరం ఉన్న 1000 చిన్నారులకు కార్డియాక్ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ విషయం గురించి బయటికి తెలియడానికి కారణం నమ్రతానే. కొంత చేస్తే ఎంతో చెప్పుకునే ప్రస్తుత సమాజంలో ఇంత గొప్ప బృహత్కార్యంలో భాగస్వామ్యం అందుకున్నప్పుడు దాన్ని అందరికి చేరవేయాలి. అప్పుడే ఇంకొందరికి స్ఫూర్తి కలుగుతుంది. నమ్రతా చేస్తోంది అదే. లండన్ ట్రిప్ ముగించుకున్న మహేష్ త్వరలోనే సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మహేష్ తో సహా ముగ్గురు నిర్మాతలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు.