Begin typing your search above and press return to search.

నమ్రత 'నో' చెప్తే మహేష్ తో డీల్ ఫిక్స్ అంట!

By:  Tupaki Desk   |   16 Aug 2018 10:23 AM GMT
నమ్రత నో చెప్తే మహేష్ తో డీల్ ఫిక్స్ అంట!
X
సహజంగా గతంలో పిల్లలతో నాన్నలు స్ట్రిక్ట్ గా ఉండేవారు. దాంతో ఏం కావాలన్నా అమ్మ దగ్గరకెళ్ళి కాకాపట్టి ఒప్పిస్తే ఆమె నాన్నకు రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు కాలం మారింది. అమ్మలు స్ట్రిక్ట్ గా ఉంటే నాన్నలు పిల్లలను గారాబం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అందుకేమీ ఎక్సెప్షన్ కాదు. మహేష్ అసలే ఒక జెంటిల్ మ్యాన్.. ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం తెలిసిందే.

ఎప్పుడు సమయం దొరికినా ఫ్యామిలీని ఫారెన్ ట్రిప్పులకు తీసుకుపోతుంటాడు. అంతే కాదు పిల్లల్ని ఎక్కువగా గారాబం చేస్తాడట. గతంలో ఒక ఇంటర్వ్యూ లో కూడా మహేష్ ఇదే విషయాన్ని వెల్లడించాడు. నమ్రత పిల్లలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పట్టించుకుంటుందని తనకు మాత్రం అవకాశం వస్తే వాళ్ళచేత స్కూల్ కు డుమ్మా కొట్టిస్తానని చెప్పడం విశేషం. తాజాగా నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో గౌతమ్ -సితారలు డాడీ మహేష్ తో ఏదో గూడుపుటాణీ చేస్తున్నఒక ఫోటో ను పోస్ట్ చేసింది. రీసెంట్ గా టూర్ కు వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలా ఉంది. ఆ ఫొటోకు ఇలా కామెంట్ పెట్టింది. "అమ్మ 'నో' చెప్పింది..దాంతో నాన్నతో నైస్ గా డీల్ సెట్ చేసుకుంటున్నారు."

ఫోటోలో గౌతమ్ స్మైల్ ఇస్తూ ఉన్నాడు గానీ సితార పాప ఎదో మాత్రం ముద్దుగా అమ్మ ఒప్పుకోలేదని చెప్తున్నట్టుగా ఉంది. పాపం మహేష్ ఏం చేస్తాడు.. ముద్దుల కూతురు ముద్దు ముద్దు మాటలతో ఏదో కావాలని అడిగితే 'నో' ఎలా చెప్తాడు? ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా అది చాలా కష్టమైన పనే..!