అందుకే మహేష్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకోలేదు!

Thu Jan 24 2019 14:34:17 GMT+0530 (IST)

మహేష్ బాబు వైఫ్ నమ్రత జనవరి 22 న తన పుట్టిన రోజు జరుపుకుంది. నమ్రత - మహేష్ ల పెళ్లై ఇప్పటికి పద్నాలుగేళ్ళు అయింది.  అప్పటి నుంచి ఇప్పటివరకూ మహేష్ లేకుండా నమ్రత ఎప్పుడూ తన పుట్టిన రోజును జరుపుకోలేదట.  కానీ ఈసారి మహేష్ లేకుండానే నమ్రత తన పుట్టినరోజును పిల్లలు గౌతమ్.. సితారలతో పాటు తనకు చాలా సన్నిహితులైన వారితో జరుపుకుంది.మహేష్ తాజా చిత్రం 'మహర్షి' షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇవ్వలేకపోయాడట.  ఇలాంటి పరిస్థితి ఉంటే నమ్రత ముంబైకి వెళ్ళి ఉండొచ్చు కదా అనే అనుమానం మీకు రావొచ్చు. కానీ గౌతమ్ కు ఎగ్జామ్స్ ఉండడంతో నమ్రత అలాంటి ఆలోచన పెట్టుకోలేదట. ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇన్నేళ్ళ తర్వాత కూడా కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలాగా చేయడం బాగుండదని అంటోంది నమ్రత.  

అలా అని సెలబ్రేషన్స్  లేవని కాదు.  నమ్రతకు సన్నిహితులైన ఫ్రెండ్స్ ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చారు.  వారితో కలిసి ఫలక్ నుమా ప్యాలెస్ లో తన పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకుంది. మరోవైపు నమ్రత పుట్టిన రోజుకు మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఒక క్యూట్ ఫోటో పోస్ట్ చేసి స్వీట్ విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే.   మహేష్ ఫ్యాన్స్ కూడా చాలామంది వదినమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.