Begin typing your search above and press return to search.

స్పాటెడ్: చిరు పార్టీలో అమేజింగ్ భార్యలు

By:  Tupaki Desk   |   25 Aug 2016 5:44 AM GMT
స్పాటెడ్: చిరు పార్టీలో అమేజింగ్ భార్యలు
X
మెగాస్టార్ చిరంజీవి కోడలు.. ఉపాసన.. అలాగే అల్లు అరవింద్ కోడలు స్నేహ రెడ్డి.. వీళ్లు ఎప్పుడూ కలసి ఫోటోలు అవీ దిగుతూనే ఉంటారు. చాలా అకేషన్లలో వీరు కలసి ఫోటోలకు ఎన్నో పోజులిచ్చారు. అయితే ఇప్పుడు వీరితో మాజీ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ జాయిన్ అవ్వడమే అసలైన కిక్ అంటున్నారు సినిమా వర్గాలు.

మొన్న హైదరాబాద్ లోని పార్కు హయాత్ హోటల్ లో మెగాస్టార్ చిరంజీవి 61వ జన్మదిన వేడుకల పార్టీ ఒకటి జరిగింది. ఈ పార్టీకి మహేష్‌ తో పాటు నమ్రతా శిరోద్కర్ కూడా విచ్చేసింది. అయితే అక్కడున్నంత సేపూ.. చెర్రీ వైఫ్‌ ఉపాసన.. అండ్ బన్నీ వైఫ్‌ స్నేహ రెడ్డితో నమ్రత భలే టైమ్ స్పెండ్ చేసిందట. అదిగో.. ఆ ఇద్దరి చేతులను కలిపేసి.. తాను కూడా ఒక చెయ్యేసి.. నమ్రత ఎంత జోవియల్ గా ఎంజాయ్ చేస్తోందో చూడండి.

ఇదే విషయాన్ని షేర్ చేసిన ఉపాసన.. ''అమేజింగ్ భార్యలు.. అదిరిపోయారు'' అంటూ కామెంట్ కూడా చేసింది. అంతేకాదండోయ్.. ''వెయిటింగ్ ఫర్ శ్రీయ భూపాల్'' అని కూడా చెప్పింది. ఆ శ్రీయ ఎవరో తెలుసుగా?? అదేనండీ అక్కినేని అఖిల్ ప్రేమలో పడ్డాడు అంటున్నారుగా.. ఆ అమ్మాయే.