Begin typing your search above and press return to search.

నమితతో సెల్ఫీతో అమితానందం!

By:  Tupaki Desk   |   1 Oct 2016 4:59 AM GMT
నమితతో సెల్ఫీతో అమితానందం!
X
ఏమాటకామాట చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఫుల్ గా సినిమాలు ఉన్నా, లేకపోయినా హీరోయిన్ నమిత కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గదనడంలో అతిశయోక్తి లేదేమో! ప్రస్తుతం ఈమె అధికంగా తెరపై కనిపించకపోయినా సినీ జనాలేకాదు, సాధారణ ప్రజల్లోనూ ఆమె క్రేజే ఏమాత్రం తగ్గడంలేదు. ఏ కొత్త షాప్ ఓపెనింగ్ కి వెళ్లినా ఆమె చుట్టూ జరుగుతున్న తొక్కిసలాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొవచ్చు. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు... ఈ ముద్దుగుమ్మ ఎంత బొద్దుగున్నా అభిమానులకు ముద్దే!! అయితే తాజాగా మరోసారి సెల్ఫీ తో వార్తల్లో నిలిచింది నమిత.

తాజాగా నమిత, నెల్సన్‌ మాణిక్యం రోడ్డులో తన కారులో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో అటుగా ఒక ఆటో వెళ్తుంది. ఆ ఆటోని, ఆ ఆటోడ్రైవర్ ని చూసిన నమిత తెగ ఆనందపడిపోయారట. కారణం... ఒక మహిళ ఆ ఆటో నడుపుకుంటూ రావడం నమిత కంటపడటమే! దీంతో, వెంటనే తన కారు ఆపి కిందకు దిగిన నమిత నేరుగా ఆ మహిళా ఆటోడ్రైవర్‌ను కలిసి ఆమెతో టక్కున సెల్ఫీలు తీసుకుంది.

ఈ ఊహించని పరిణామంతో షాక్ కి గురై, అనంతరం తెరుకున్న ఆ మహిళా ఆటో డ్రవర్ "మీరు నాతో ఫోటో దిగడం అన్నది నిజమేనా లేక కలా? అని నమితను అడిగింది. ఆ ప్రశ్నపై స్పందించిన నమిత... "జీవితంలో నమ్మశక్యం కానిదేదీ లేదనీ, నమ్మకమే జీవితం" అని చెప్పిందట. అయితే.. ఆ మహిళ పేరు ధనలక్ష్మీ అని తెలుసుకున్న నమిత, కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్నందుకు ఆమెకు సెల్యూట్ చేసి అక్కడ నుంచి బయలు దేరారు! ఈ పరిణామం వల్ల నమితకు ఎంత ఆనందం కలిగిందో తెలియదు కానీ... ఆ ఆటోడ్రైవర్ ధనలక్ష్మి మాత్రం అమితానందంలో మునిగిపోయారట... నమిత చేసిన సెల్యూట్ ఆమెకు కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/