Begin typing your search above and press return to search.

వామ్మో నమితా.. ఏంటా అవతారం?

By:  Tupaki Desk   |   6 Feb 2016 1:30 PM GMT
వామ్మో నమితా.. ఏంటా అవతారం?
X
నమిత పేరెత్తగానే ఆమె చేసిన గ్లామర్ రోల్సే కళ్ల ముందు మెదులుతాయి. కెరీర్ ఆరంభంలో కొంచెం పద్ధతిగానే కనిపించిన నమిత.. ఆ తర్వాత డోస్ పెంచి ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకుల మతులు పోగొట్టింది. ముఖ్యంగా బొద్దు భామల్ని బాగా ఇష్టపడే తమిళ ప్రేక్షకులు నమిత భారీ అందాలకు ముగ్ధులైపోయారు. ఆమెకు గుడి కట్టించేంతగా అభిమానం పెరిగిపోయింది జనాల్లో. ఐతే ఓ దశలో మరీ బరువెక్కిపోయిన చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా తయారైంది. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. రెండు మూడేళ్లుగా ఆమె పేరే ఎక్కడా వినిపించట్లేదు.

ఐతే సడెన్ గా ఈ మధ్య కొంచెం స్లిమ్ అయి సరికొత్త లుక్ తో అందరికీ షాకిచ్చిన నమిత.. మళ్లీ సినిమాల్లోకి పునరాగమనం చేస్తోంది. తమిళ - తెలుగు భాషల్లో హార్రర్ కామెడీల హవా సాగుతున్న నేపథ్యంలో ‘పొట్టు’ అని ఆ టైపు సినిమాలోనే నటిస్తోంది నమిత. ఇందులో ఆమెది దయ్యం పాత్ర. ఐతే హన్సిక - త్రిష లాంటి టాప్ హీరోయిన్లు కూడా దయ్యం పాత్రలు వేశారు కానీ.. ఆ క్యారెక్టర్లలో కూడా అందంగానే కనిపించారు. కానీ నమిత అవతారం మాత్రం భయంకరంగా ఉంది. అసలే భారీ అవతారం.. పైగా దయ్యం పాత్ర.. పైగా చిత్రమైన మేకప్.. మొత్తానికి నమితను చూడగానే మరో రకమైన భయం కలుగుతోంది. పోస్టర్లతోనే ఇంత భయపెట్టిన నమిత ఇక సినిమాలో ఇంకెంతగా టెర్రర్ పుట్టిస్తుందో?