Begin typing your search above and press return to search.

ప్రగ్యాతో పరుగులు పెట్టించాడుగా!!

By:  Tupaki Desk   |   3 Dec 2016 10:25 AM GMT
ప్రగ్యాతో పరుగులు పెట్టించాడుగా!!
X
సుందరాంగులు అప్పుడప్పుడూ లేడీ ఓరియెండెడ్ మూవీస్ చేస్తుంటారు. ఇప్పుడంటే ఫిమేల్ ఓరియెండెట్ సబ్జెక్టులంటే దెయ్యాల సినిమాలు వస్తున్నాయ్ కానీ.. గతంలో పోలీస్ స్టోరీలో.. ఫైటింగులు చేసే కాన్సెప్టులో ఉండేవి. అయితే.. ఇలాంటి సబ్జెక్టు కాకపోయినా.. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మాత్రం ఫైట్లు ఓ రేంజ్ లో ఉతికి ఆరేస్తోంది.

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రం మూవీ శరవేగంగా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి తన క్రియేటివిటీ చూపించేందుకు నానా పాట్లు పడుతున్న ఈ దర్శకుడు.. నక్షత్రం పేరుతో ఓ యాక్షన్ మూవీ తీసేస్తున్నాడు. ఈ మూవీలో ప్రచారంలో భాగంగా రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తున్న దర్శకుడు.. ఇప్పుడు ఫైట్స్ కంపోజింగ్ పై ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో అందరూ తెగ ఫైట్స్ చేసేస్తున్నా.. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందయితే ప్రగ్యా జైస్వాల్ గురించే. గాల్లో ఎగిరి తన్నేయడాలు.. నిలువునా గోడను ఎక్కేయడాలు.. ఇద్దరు ముగ్గురిని ఒకేసారి పడగొట్టేయడాలు.. పరుగెట్టి వెంటాడ్డం.. ఫైట్ మాస్టర్ శ్రీధర్ పై తీసిన ఈ మేకింగ్ వీడియోలో.. రకరకాల స్టంట్స్ తో అదరగొట్టేసింది ప్రగ్యా.

నక్షత్రంలో సందీప్ కిషన్- రెజీనా హీరోయిన్లయితే.. సాయిధరంతేజ్- ప్రగ్యా జైస్వాల్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సుకుమారే ఈ రేంజ్ లో ఇరగదీస్తే.. మరి మిగతావాళ్లు ఏ రేంజ్ లో దంచికొట్టారో?



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/