Begin typing your search above and press return to search.

‘జూలీ-2’పై నగ్మా స్పందించింది

By:  Tupaki Desk   |   23 Nov 2017 7:38 AM GMT
‘జూలీ-2’పై నగ్మా స్పందించింది
X
మొత్తానికి ‘జూలీ-2’ సినిమా నగ్మా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అనే విషయం దేశం మొత్తం పాకిపోయింది. ఈ చిత్ర సమర్పకుడు ప్రహ్లాద్ నిహ్లాని.. నగ్మా పేరెత్తలేదు కానీ.. ఈ సినిమా కథ ఆమెదే అని అర్థమయ్యేలా అవసరమైన హింట్స్ అన్నీ ఇచ్చేశాడు. అన్ని వివరాలూ చెప్పేసి.. ఆ పేరు మాత్రం చెప్పను.. చెబితే మా సినిమా విడుదల కాకుండా ఆగిపోతుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో కేవలం పబ్లిసిటీ కోసమే ఆయన ఈ సంగతి వెల్లడించిన విషయం స్పష్టమైపోయింది. ఓ రెండు మూడు వారాల ముందే ఈ విషయం చెప్పి ఉంటే.. కచ్చితంగా ఈ సినిమాకు బ్రేక్ పడేదే. నగ్మా పేరెత్తకుండా తాము ఎవరి కథతో సినిమా తీశామో.. ఆ నటితో సంబంధం పెట్టుకున్న నటుడు కూడా ‘జూలీ-2’లో నటిస్తున్నాడని ప్రహ్లాద్ చెప్పడం గమనార్హం. ఇది కచ్చితంగా చీప్ పబ్లిసిటీ అనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తన కథతో ‘జూలీ-2’ తెరకెక్కిందనే విషయం నగ్మా వరకు చేరిపోవడం విశేషం. ఆమె ఈ సినిమా విషయమై స్పందించింది కూడా. తొలిసారి ఈ మాటల్ని వింటున్నానని.. ఇప్పుడు తాను చెయ్యగలిగిందేమీ లేదని.. సినిమా విడుదలయ్యాక చూద్దామని.. తన పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేయాలని చూస్తున్నట్లుందని.. ఇంతగా దిగజారిపోతారని తాను అనుకోలేదని నగ్మా చెప్పింది. మరి విడుదల తర్వాత తన రెఫరెన్సులుంటే నగ్మా ఏమైనా గొడవ చేస్తుందా..? దాని వల్ల సినిమాకు బ్రేక్ పడుతుందా..? లేక దాన్ని కూడా పబ్లిసిటీకి వాడేసుకుంటారా అన్నది చూడాలి.