`దేవదాస్`కు సెప్టెంబరు సెంటిమెంట్!

Thu Jul 12 2018 19:29:08 GMT+0530 (IST)

రాజకీయాల్లో - సినిమాల్లో చాలామందికి రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. అందులోనూ సినిమా వాళ్లకు పండుగ సెంటిమెంట్లతో పాటు ...డేట్ సెంటిమెంట్ కూడా బలంగా ఉంటుంది. టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ - మహేష్ ఎక్కువగా... సంక్రాంతిని టార్గెట్ చేసుకొని సినిమాలు విడుదల చేస్తుంటారు. బాలీవుడ్ కండలవీరుడు సల్లూ భాయ్...కు `ఈద్` సెంటిమెంట్ ఉంది. ఇక తమిళ తంబీలకు `దీపావళి `సెంటిమెంట్. అదే తరహాలో టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కు మంత్  సెంటిమెంట్ ఉంది. ఇప్పటివరకు తమ బ్యానర్ లో సెప్టెంబరులో విడుదలైన సినిమాలన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి. దీంతో తాజాగా తమ బ్యానర్ లో నాగ్ - నానిల కాంబోలో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్ `దేవదాస్`ను కూడా సెప్టెంబరులోనే రిలీజ్ చేయాలని వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ భావిస్తున్నారట.సెప్టెంబరు 27న ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెం.1’  - సెప్టెంబరు 28న `చిరుత` - `శుభలగ్నం` సెప్టెంబరు 30.....ఇలా తమ బ్యానర్లో సెప్టెంబరు నెలలో విడుదలైన చిత్రాలన్నీ వైజయంతీకి విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఆ సెంటిమెంట్ తోనే తాజాగా నాగార్జున - నాని ల కాంబోలో శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న ఈ మల్టీస్టారర్  `దేవదాస్ ` ను కూడా సెప్టెంబరులోనే విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. సెప్టెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘మహానటి’తో మంచి హిట్ అందుకున్న వైజయంతీ మూవీస్....‘దేవదాస్’ తో మరో హిట్ అందుకుంటుందేమో వేచిచూడాలి. `దేవదాస్`ఓ కామెడీ ఎంటర్ టైనర్ అని - తాను ఓ రొమాంటిక్ మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నానని నాగ్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. నాగ్  ఫ్రెండ్ అయిన నాని ఓ డాక్టర్ అని....తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డాన్ గ్యాంగ్ కు సపోర్ట్ చేసే రోల్ ను నాని పోషిస్తున్నాడని నాగ్ రివీల్ చేశాడు. అయితే `ఆఫీసర్`పై భారీ అంచనాల నేపథ్యంలో....`దేవదాస్`పై అంచనాలు తగ్గించేందుకే నాగ్ ఉద్దేశ్యపూర్వకంగానే స్టోరీ రివీల్ చేసినట్లు తెలుస్తోంది.