నాగ్ జోకేశాడు... పేలలేదు బాసూ

Thu May 17 2018 17:15:23 GMT+0530 (IST)

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునకి సెన్సార్ హ్యుమర్ బాగా ఉంటుంది. సందర్భానికి తగ్గట్టుగా ఆయన వేసే పంచులు- జోకులు జనాలను అలరిస్తాయి. అందుకే నాగ్ వెండితెర మీదే కాదు బుల్లితెర మీద సక్సెస్ సాధించాడు. అయితే కొన్నిసార్లు ఎంత సెన్సాఫ్ హ్యుమర్ ఉన్న టైమింగ్ మిస్సయితే జోక్ పేలదు. ఇప్పుడు నాగ్ వేసిన జోక్ కూడా అలాంటిది.అలనాటి అద్భుత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మహానటి’ చిత్రం ఘనవిజయం సాధించి... సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ సినిమా పుణ్యమాని నేటితరం కుర్రాళ్లు కూడా సావిత్రి గురించి... జెమినీ గణేశన్ గురించి తెలుసుకోవడానికి నెట్ లో వెతుకుతూ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నాగ్ కూడా కె.వి.రెడ్డి దర్శకత్వంలో సావిత్రి- ఎస్వీఆర్- ఎన్.టీ.ఆర్ - ఎ.ఎన్.ఆర్ వంటి మహా మహా లెజెండరీ నటులు నటించిన అద్భుత దృశ్యకావ్యం ‘మాయాబజార్’ లోని మాయా దర్పిణి సన్నివేశాన్ని చూశారు. ‘1952లోనే వైఫై - వీడియో ఛాట్ ఉన్న ల్యాప్ ట్యాప్ మనవాళ్లే మొదట తయారుచేశారనడానికి ఇదే సాక్ష్యం’ అంటూ ఆ వీడియోను పోస్టు చేశాడు నాగార్జున.

అయితే నిజానికి మాయబజార్ సినిమా 1957లో విడుదలయ్యింది. 1952లో కాదు. డేటు విషయంలో పొరబడినా పర్లేదు కానీ ఇది చాలా పాత జోక్. నిజం చెప్పాలంటే నాగ్ చేసిన కామెంట్ పేరులోనే యూట్యూబులో ఓ వీడియో కూడా ఉంది. అదీ మూడేళ్ల కిందట అప్ లోడ్ చేసిన వీడియో. దాంతో తన సెన్సాఫ్ హ్యుమర్ తో జనాలను నవ్విద్దామనుకున్న నాగ్... కొంచెం వెనకబడిపోవడం సరైన జోక్ పేల్చలేకపోయారు.

వీడియో కోసం క్లిక్ చేయండి