Begin typing your search above and press return to search.

అంధుడి పాత్రలో నాగ్ కూడానా??

By:  Tupaki Desk   |   30 Sep 2016 7:43 AM GMT
అంధుడి పాత్రలో నాగ్ కూడానా??
X
మొన్నామధ్యన యంగ్ హీరో రామ్ ఒక అంధుడి పాత్రలో నటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఆ సినిమాను ఎనౌన్స్ చేయగానే అందరి మైండ్ లోనూ మెలిగిన థాట్ ఏంటంటే.. ఆ మధ్యన రిలీజైన మలయాళం సినిమా ''ఒప్పం''. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారట.

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో.. మన హీరో గుడ్డివాడు. అయితే అతను ఉండే అపార్టుమెంటులో ఒక మర్డర్ జరుగుతుంది. ఇప్పుడు మనోడు ఎలా రీసెర్చ్ చేసి తన వైకల్యాన్ని అధిగమించి ఆ హంతకుడిని పట్టుకుంటాడనేదే ఈ థ్రిల్లర్ సారాంశం. అయితే ఇప్పుడు తెలుగులో నాగార్జున ఈ అంధ హీరో పాత్రను చేస్తే బాగుంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ సందర్భంగా నాగ్ ను కలసి ఆయనకు మలయాళ సినిమా డివిడి చూపించాలనేది వారి ప్రయత్నం.

ఇప్పటికే తెలుగులో ఊపిరి వంటి ఛాలెంజింగ్ రోల్ లో నటించిన నాగార్జున ఇప్పుడు ఈ పాత్రను చేయడానికి సుముఖత చూపిస్తారా? ఒకవేళ అలా చేస్తే మాత్రం నాగ్ చాలా గ్రేటనే చెప్పాలి. మన స్టార్ హీరోల్లో అలాంటి ధైర్యం చేసిన వారిలో ఆయన మొదటి వ్యక్తి అవుతారు అప్పుడు!!