Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 3: వచ్చేవారంలో ప్రకటన

By:  Tupaki Desk   |   16 May 2019 4:36 AM GMT
బిగ్ బాస్ 3: వచ్చేవారంలో ప్రకటన
X
తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ కుఅక్కినేని నాగార్జున హోస్ట్ గా రావడం దాదాపుగా ఖాయమేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి కదా. ఇప్పుడు ఆ దిశగా జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయట. నాగార్జున గత కొంతకాలంగా 'మన్మథుడు 2' యూరోప్ షెడ్యూల్ కోసం పోర్చుగల్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈమధ్యే హైదరాబాద్ తిరిగి వచ్చారట. దీంతో బిగ్ బాస్ టీమ్ వారు నాగార్జునతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.

మూడవ సీజన్ కోసం ఫైనల్ రౌండ్ డిస్కషన్స్ లో రెమ్యూనరేషన్ తో పాటుగా షో జరిపే తీరుతెన్నులపై కూడా నాగ్ ప్రత్యేకంగా చర్చిస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరించిన నాని పలు కారణాల వల్ల స్ట్రెస్ ఫీలయిన సంగతి తెలిసిందే. లేనిపోని వివాదాలతో తన ఇమేజ్ కు నష్టం జరుగుతుందని భావించి బిగ్ బాస్ 3 కి దూరంగా జరిగాడు. ఇప్పుడు కొత్త సీజన్ లో వివాదాలు నెలకొన్నా.. నాగార్జున అలా ఇబ్బంది పడకుండా ఉండేలా పావులు కాదుపుతున్నాడని టాక్ వినిపిస్తోంది. షో నిర్వహించే పద్ధతి.. కంటెస్టెంట్ల విషయంలో బిగ్ బాస్ వారికి నాగ్ కొన్ని కండిషన్స్ పెట్టారని కూడా అంటున్నారు.

మరో వారం రోజుల్లో బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా నాగార్జున పేరును హోస్ట్ గా ప్రకటిస్తారని సమాచారం. 'మన్మథుడు 2' షూటింగ్ మొత్తం జూన్ నెలాఖరుకల్లా పూర్తవుతుందని.. దీంతో బిగ్ బాస్ సీజన్ 3 మొదలయ్యే సమయానికి నాగార్జున బిగ్ బాస్ షోకు అందుబాటులో ఉంటారని అంటున్నారు.