Begin typing your search above and press return to search.

రాజుగారి గది-2కు రీషూట్లు చేయిస్తున్నా-నాగ్

By:  Tupaki Desk   |   23 May 2017 11:09 AM GMT
రాజుగారి గది-2కు రీషూట్లు చేయిస్తున్నా-నాగ్
X
అక్కినేని నాగార్జునకు రీషూట్ల స్పెషలిస్టుగా పేరుంది. మామూలుగా ఏదైనా సినిమాకు సంబంధించి రీషూట్లు జరుగుతున్నాయంటే దాని గురించి నెగెటివ్ గా మాట్లాడుకునేవారు. కానీ నాగ్ ఆ అభిప్రాయాన్ని మార్చారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా ఔట్ పుట్ విషయంలో తాను సంతృప్తి చెందక రీషూట్లు చేయించిన మాట వాస్తవమే అని అంగీకరించారు. సినిమా విడుదలయ్యాక తేడా జరిగిందని బాధ పడటం కంటే ముందే చూసి జాగ్రత్త పడితే.. రీషూట్లు చేయిస్తే తప్పేంటన్నది నాగ్ లాజిక్. ఇది కన్విన్సింగ్ గా అనిపించింది అందరికీ. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’కు కూడా కొన్ని రిపేర్లు జరిగినట్లు నాగార్జునే చెప్పాడు.

ఐతే తన ప్రొడక్షన్లో జరిగే సినిమాలకే కాదు.. బయటి వాళ్లకు చేస్తున్న సినిమాల విషయంలోనూ నాగ్ రాజీ పడట్లేదని తెలుస్తోంది. నాగ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘రాజు గారి గది-2’కు కూడా రీషూట్ సజెస్ట్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో నాగ్ వెల్లడించడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి తన పని పూర్తయిందని.. ఐతే రషెస్ చూశాక కొన్ని సన్నివేశాల విషయంలో సంతృప్తి చెందలేదని.. దర్శక నిర్మాతలకు ఆ సన్నివేశాలు రీషూట్ చేద్దామని చెప్పానని.. వాళ్లు సరే అన్నారని నాగ్ తెలిపాడు. మళ్లీ పది రోజుల పాటు ఈ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నట్లు నాగ్ వెల్లడించడం విశేషం. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్నారు.