Begin typing your search above and press return to search.

బంగార్రాజు పక్కన పెట్టేసినట్టే

By:  Tupaki Desk   |   28 May 2017 10:30 AM GMT
బంగార్రాజు పక్కన పెట్టేసినట్టే
X
నాగార్జున హీరోగా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా బంపర్ హిట్ కొట్దింది. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ‘వాసివాడి తస్సాదియ్యా’ అంటూ పల్లెటూరి మోతుబరి రైతు బంగార్రాజు పాత్రలో నాగార్జున అదరగొట్టాడు. ఈ క్యారెక్టర్ జనాలకు ఎంతగా నచ్చిందీ అంటే బంగార్రాజు పాత్ర హీరోగా ఓ సినిమా చేస్తానని నాగార్జున ప్రకటించాడు. ‘సోగ్గాడే చిన్నినాయనే’ డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా డైరెక్ట్ చేస్తాడని అనౌన్స్ చేశారు. ‘బంగార్రాజు’ టైటిల్ ను కూడా రిజిస్టర్ చేశారు.

ఏడాది గడిచినా బంగార్రాజు గురించి చడీ చప్పుడు లేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచీ ప్రారంభించేది కూడా చెప్పలేదు. స్టోరీ లైన్ అనుకున్నారే తప్ప స్టోరీ ఫైనల్ చేయలేదు. ఈలోగా కొడుకులిద్దరి కెరీర్ ను పట్టాలెక్కించే పనిలో నాగార్జున బిజీ అయిపోయాడు. ఈ ఏడాది కాలంలో నాగచైతన్య ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం రెండు సినిమాలు చేశాడు. ఇందులో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు నాగార్జునే ప్రొడ్యూసర్. దీంతో అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఈ సినిమాతో నాగచైతన్యను ఫ్యామిలీ హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. మరోవైపు చిన్న కొడుకు అఖిల్ ను హీరోగా నిలబెట్టేందుకు ఎన్నో స్టోరీలు విని చివరకు తనకు మనంతో డీసెంట్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె.కుమార్ కు ఓకే చెప్పాడు.

ప్రస్తుతం నాగార్జున ఓంకార్ డైరెక్టర్ గా రాజుగారి గది-2 సినిమా చేస్తున్నాడు. ముందు వెకేషన్ కోసం ఫ్యామిలీతో ఫారిన్ టూర్ లో వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక రాజుగారి గది-2 సినిమా పూర్తి చేస్తానంటున్నాడు. ఈలోగా నాగచైతన్య-సమంతల పెళ్లి హడావుడి మొదలైపోతుంది. సో.. దీనిని బట్టి చూస్తే బంగార్రాజు మొదలెట్టే అవకాశం లేదు. నాగార్జున కూడా బంగార్రాజు మాటెత్తితే కొంతకాలం ఈ విషయం వదిలేమంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/