తియ్యటి బొబ్బట్టులాంటి సినిమా -నాగ్

Sat Jan 13 2018 10:05:17 GMT+0530 (IST)

ఒక సినిమా ఎలా ఉన్నా కూడా ఈ రోజుల్లో ప్రమోషన్స్ ఉండి తీరాల్సిందే. ఇది అందరికి తెలిసిన విషయమే. స్టార్ హీరోలైన - పరిచయం అవుతున్న హీరోలైన ప్రమోషన్స్ చేయాల్సిందే. ఇక టాలీవుడ్ లో ప్రమోషన్స్ చేయాలంటే ఎవరైనా నాగార్జున తరువాత. ఆయన పేరే మొదట ఎక్కువగా వినిపిస్తుంది. తనకు సంబందించిన సినిమాల గురించి నాగ్ ఎప్పుడైనా.. ఎక్కడైనా సరే ప్రమోషన్స్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు.ఆయన హీరోగా చేసిన గత చిత్రాలు చాలా వరకు ప్రచారాల వల్లనే క్రేజ్ ఎక్కువగా వచ్చింది. ఇక మొన్నటి వరకు హలో సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నాగ్ ఎట్టకేలకు అఖిల్ స్థాయిని కొంచెం పెంచాడు. ఇక ఇప్పుడు తన ప్రొడక్షన్ లో వస్తోన్న స్వీట్ లవ్ స్టోరీకి హైప్ తేవాలని ప్లాన్ వేశాడు. రాజ్ తరుణ్ -చిత్ర శుక్ల నటించిన రంగుల రాట్నం అనే సినిమా జనవరి 14 ఆదివారం రిలీజ్ కానుంది. అన్నపూర్ణ ప్రొడక్షన్ పై తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీ రంజని దర్శకత్వం వహించారు.

అయితే సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా కావున నాగార్జున ప్రమోషన్స్ రంగంలోకి దిగాడు. రీసెంట్ గా మీడియా ముందుకు కూడా వచ్చాడు. చిత్ర యూనిట్ పై నాగ్ ఎంతో నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ''ఈ సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియోస్ అందిస్తున్న తియ్యటి బొబ్బట్టులాంటి సినిమా రంగుల రాట్నం'' అంటూ కామెంట్ చేశాడు నాగ్. ఇంతకుముందు ఇదే బ్యానర్ లో రాజ్ తరుణ్ చేసిన మొదటి సినిమా ఉయ్యాలా జంపాల మంచి హిట్ అయినా సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా ద్వారా రాజ్ తరుణ్ మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి రంగుల రాట్నం ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.