Begin typing your search above and press return to search.

నాకు మైండ్ దొబ్బలేదు -నాగార్జున

By:  Tupaki Desk   |   20 Nov 2017 6:25 AM GMT
నాకు మైండ్ దొబ్బలేదు -నాగార్జున
X
''నాకు మైండ్ దొబ్బలేదు. నా మైండ్ బాగానే ఉంది. నేను ఈ సినిమా కథ విన్నప్పటి నుండి.. షూటింగ్ కు వెళ్ళాలి.. సినిమాను తియ్యాలి.. అనే ఎక్సయిట్మెంట్ తో ఉన్నాను. పనిచేయాలంటే రోజూ ఇలా ఎక్సయిట్మెంట్ ఉంటే భలే ఉంటుంది. శివ సినిమా తీసినప్పుడు హిట్ అవుతుందా అనుకోలేదు. ఇప్పుడు కూడా మేం అనుకోవట్లేదు. ఒకరిమీద ఒకరం నమ్మకంతో సినిమా చేస్తున్నాం'' అన్నారు కింగ్ నాగార్జున.

ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున మరోసారి రామ్ గోపాల్ వర్మ డైరక్షన్లో సినిమా చేయడానికి కొబ్బరికాయ కొట్టేశారు. ''నాన్నగారు అప్పట్లో ఓ మాటన్నారు. 28 ఏళ్ళకు ఒక నటునికి పరిపూర్ణత వస్తుంది అన్నారు. అలా 28 ఏళ్ళ వయస్సులో శివ చేశాను. ఇప్పుడు 28 ఏళ్ల తరువాత డబుల్ మెట్యూరిటీ వస్తోందని నమ్ముతున్నాను. మళ్ళీ రామూతో సినిమా చేస్తున్నాను'' అంటూ చెప్పాడు నాగ్.

ఇక సినిమా గురించి చెబుతూ.. ''రాము బోలెడన్ని మాఫియా మరియు పోలీస్ సినిమాలు చేశాడు. కాని ఈ సినిమా వేరు. మెయిన్ క్యారక్టర్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ అద్భుతం. అదే నాకు బాగా నచ్చింది. రాము కొన్నిసీన్లు చెబుతుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయ్. అందుకే ఈ సినిమా చేస్తున్నాం. అలాగే ఈ సినిమాతో రాము మరోసారి టెక్నికల్ స్టాండర్స్డ్ ను కొత్త స్థాయికి తీసుకెళతానని మాటిచ్చాడు. శివతో ఎలాగైతే దేశ వ్యాప్తంగా ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశామో.. ఇప్పుడు కూడా అదే చేస్తాం'' అంటూ స్పందించాడు ఈ సీనియర్ అక్కినేని హీరో.

ఈ సినిమాతో నాగ్ కెరియర్ కు పెద్దగా చేకూరే లాభనష్టాలు ఉన్నా లేకపోయినా కూడా.. రామ్ గోపాల్ వర్మకు మాత్రం ఈ విజయం కీలకం. ఎందుకంటే ఈ సినిమా తేడాపడితే ఇక స్టార్ హీరోలు ఆయన్ను దూరం పెట్టేశే ప్రమాదం ఉంది. #NagRGV4