Begin typing your search above and press return to search.

బికినీ బ్యూటీతో నాగ్ రొమాన్స్ కేకలే

By:  Tupaki Desk   |   24 March 2017 8:13 AM GMT
బికినీ బ్యూటీతో నాగ్ రొమాన్స్ కేకలే
X
అక్కినేని నాగార్జున ప్రస్తుతం రాజుగరి గాది 2 చిత్రంలో నటిస్తున్నారు. సోషల్ మీడియాలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మహా యాక్టివ్ గా ఉన్న నాగ్.. మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి.. మళ్లీ బ్యాక్ ఇన్ బిజినెస్ అంటూ పనిలో పడ్డానని ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే.

ఓ వారం రోజులుగా.. పాండిచెర్రీ సముద్రం తీరం నుంచ రాజుగారి గది 2 షూటింగ్ కి సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తున్న నాగ్.. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగొచ్చేశానని చెప్పారు. ' రాజుగారిగది2 కోసం పాండిచెర్రీలో సూపర్బ్ షూట్ పూర్తి చేసుకుని మళ్లీ హైద్రాబాద్ వచ్చేస్తున్నా' అంటూ ట్వీట్ పెట్టిన నాగ్.. తను బైక్ పై వస్తున్న ఫోటోలను పోస్ట్ చేశారు. వీటితో పాటు హీరోయిన్ సీరత్ కపూర్ తో పాండిచెర్రీలో షూట్ చేసిన రొమాంటిక్ షాట్స్ కి సంబంధించిన పిక్స్ కూడా చూపించారు నాగ్.

గత కొన్ని వారాలుగా బికినీ అందాలతో రెచ్చగొడుతూ.. ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న బ్యూటీ సీరత్ తో పోటీ పడిపోతున్నాడు ఈ నవ మన్మధుడు. 57 ఏళ్ల వయసులో కూడా హీరోయిన్ ను డామినేట్ చేసేస్తూ హ్యాండ్సమ్ కు మరో అర్ధంగా నిలుస్తున్నారు నాగ్. బ్యాక్ ఇన్ బిజినెస్ అని నాగ్ ట్వీట్ పెట్టినపుడు ఏంటో అనుకున్నారు కానీ.. 2 వారాల గ్యాప్ లోనే మరీ ఇంత ఛేంజ్ చూపించేయడం అంటే.. అది నాగ్ కి మాత్రమే సాధ్యం సుమీ!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/