Begin typing your search above and press return to search.

కొడుకుల్లోఎవరో ఒకరికి ఇస్తాడట

By:  Tupaki Desk   |   11 Feb 2016 10:30 PM GMT
కొడుకుల్లోఎవరో ఒకరికి ఇస్తాడట
X
కింగ్‌ నాగార్జున తన కొడుకులను ప్రాపర్‌ సెటిల్‌ చేయాలని పడుతున్న తాప్రతాయం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఒక ప్రక్కన నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక డిపెండబుల్‌ హీరోగా ఎదగలేకపోతున్నాడు. ఇంకో ప్రక్కన తొలి సినిమాతో భారీ డిజాష్టర్‌ కొట్టి రెండో సినిమా ఎవరితో చేయాలా అనే సందిగ్దంలో ఉన్నాడు అఖిల్‌. అందుకు ఇప్పుడు నాగ్‌ రంగంలోకి దూకాడు.

ఇక మొన్నటివరకు మనకు వినిపించిన ''బంగర్రాజు'' కథ గురించి ఇప్పుడు ఒక కొత్త న్యూస్‌ తెలుస్తోంది. అదేంటంటే.. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగ్‌ చేసిన బంగర్రాజు పాత్రను ఆధారంగా చేసుకొని మరో కొత్త కథను రాశాడంట దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ. అయితే ఈ సినిమాను తనతో కంటే.. తన కొడుకుల్లో ఎవరికైతే బాగుంటుంది అని నాగ్‌ ఇతగాడిని అడిగితే.. మనోడు వెంటనే నాగ చైతన్య పేరును చెప్పేశాడట. దానితో ఈ బంగర్రాజు వేషం చైతూ వేసే చాన్సుందని ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.

అయితే ఒకవేళ నాగచైతన్య కనుక ఈ మాస్‌ రోల్‌ ను క్యారీ చేయలేకపోతే.. అఖిల్‌ ఆ రోల్‌ ను టేకప్‌ చేసే ఛాన్సుందట. మొన్న సంక్రాంతికి సోగ్గాడి గెటప్స్‌ లో నాగ్‌ అండ్‌ సన్స్‌ ఇంటర్యూ ఇచ్చారు గుర్తుందా? వాళ్లను ఆ గెటప్పుల్లో చూస్తే నాగ్‌ కు ఈ ఐడియా వచ్చిందేమో మరి. అందుకే తన సినిమాను కొడుకులకు ఇచ్చేయాలని ఫిక్సయినట్లున్నాడు.