Begin typing your search above and press return to search.

ప్రేతం పనులు మొదలెట్టేసిన బాబాజీ!!

By:  Tupaki Desk   |   21 Feb 2017 4:07 AM GMT
ప్రేతం పనులు మొదలెట్టేసిన బాబాజీ!!
X
ఓం నమో వెంకటేశాయ చిత్రంలో హథీరాం బాబాగా కనిపించిన నాగార్జున.. ఈ భక్తి రస చిత్రంలో తనదైన నటనతో మెప్పించారు. నాగ్ నటనకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి కానీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు మాత్రం కురవడం లేదు. దీంతో నాగ్ కాస్త డీలా పడ్డారనే టాక్ వినిపించింది. అవన్నీ ఉత్తి కబుర్లేనని ఇప్పుడు తేలిపోయింది.

సక్సెస్ ఫెయిల్యూర్ లను పెద్దగా పట్టించుకోని నాగార్జున.. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ పనులు ప్రారంభించేశారు. ఇప్పటికే రాజు గారి గది2 పనుల్లో పాలు పంచుకుంటున్నారు నాగ్. ఇంతా షూటింగ్ ప్రారంభం కాకపోయినా.. ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం ఫుల్ పేస్ లో జరుగుతున్నాయి. ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న హీరోయిన్ సీరత్ కపూర్.. నాగార్జునతో కలిసి ఓ సెల్ఫీ కూడా దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మన్మథుడి పక్కన మనసారా నవ్వుతూ పోజ్ ఇచ్చింది సీరత్.

రాజు గారి గది సక్సెస్ కారణంగా.. నాగ్-సమంత-సీరత్ లు నటిస్తున్న ఈ మూవీకి రాజు గారి గది2 అంటున్నారు కానీ.. ఇది హారర్ కామెడీ మూవీ. మలయాళంలో గతేడాది ప్రేతం అనే టైటిల్ పై వచ్చిన చిత్రాన్ని.. తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో నాగ్ ఓ మెంటలిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. ఎదుటి వారి మనసులను చదివేసే మైండ్ రీడర్ పాత్ర.. ఈ చిత్రంలో లీడ్ రోల్. ఇప్పుడు రాజు గారి గది2లో నాగ్ చేస్తున్నది ఆ పాత్రే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/