Begin typing your search above and press return to search.

సైకిల్ చైన్ వదిలేసే.. పెద్దది తెచ్చారే

By:  Tupaki Desk   |   20 Nov 2017 8:33 AM GMT
సైకిల్ చైన్ వదిలేసే.. పెద్దది తెచ్చారే
X

నాగార్జున అండ్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'శివ' ఒక అద్భుతం. ఆ సినిమాలోని చాలా విషయాలు ఆడియన్స్ ను విస్మయానికి గురి చేశాయి. ఎనలేని కిక్ ను ఇచ్చాయి. అందుకే ఆ సినిమా ఏకంగా ఇండియన్ సినిమా తీరును మార్చేసిన సినిమాగా అందరూ అభివర్ణిస్తారు. అయితే ఇప్పుడు శివ సినిమా తరువాత మళ్లీ అలాంటి ఫీట్ చేస్తామంటూ ప్రామిస్ చేస్తున్నారు వర్మ అండ్ నాగ్.

అయితే ఇప్పుడు విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం టైటిల్ ఇంకా పెట్టలేదు కాని.. పోస్టర్లను మాత్రం క్రియేట్ చేశారు. అందులో ఒక పోస్టర్లో నాగ్ ఏకంగా ఒక పెద్ద చైన్ పట్టుకుని కూర్చుకున్నాడు. సైకిల్ చైన్ చిన్నదైందని అనుకున్నారో లేకపోతే పాతదైందని అనుకున్నారో గాని.. ఇప్పుడు మాత్రం పెద్ద చైన్ తీసుకున్నాడు నాగ్. అవన్నీ చూస్తుంటే ఇప్పుడు మాత్రం టిపికల్ మాస్ మూవీ తరహాలో ఈ పోస్టర్లున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో నాగ్ తెల్ల జుట్టుతో కనిపిస్తాడని కొన్ని పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. ఎందుకంటే ఇప్పడు సీనియర్ హీరోలందరూ ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించడానికి తెగ మోజు చూపిస్తున్నారు. రజనీకాంత్.. జగపతి బాబు.. మాధవన్.. అజిత్.. ఇలా అందరూ అదే ఫీట్ చేస్తున్నారు. ఇక నాగ్ కూడా ఆ గ్యాంగులోకి ఎంట్రీ ఇచ్చినట్లే.