బంగార్రాజు - భాగమతి మళ్లీ...!

Wed Sep 19 2018 20:07:40 GMT+0530 (IST)

సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలోని బంగార్రాజు పాత్రను బేస్ చేసుకుని ఒక చిత్రాన్ని చేయాలని నాగార్జున చాలా కాలంగా ఆశపడుతున్నాడు. ఆ చిత్రం విడుదలైన సమయంలోనే అదే దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ‘బంగార్రాజు’ చిత్రాన్ని చేస్తానంటూ నాగార్జున ప్రకటించిన విషయం తెల్సిందే. బంగార్రాజు టైటిల్ ను కూడా రిజిస్ట్రర్ చేయించాడు. కళ్యాణ్ కృష్ణ పలు వర్షన్ లలో ‘బంగార్రాజు’ కథలను సిద్దం చేశాడట. ఎన్నో కథలను విన్న తర్వాత నాగార్జున ఇటీవల ఒక స్టోరీ లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఇటీవలే స్టోరీ ఫైనల్ చేసిన నాగార్జున హీరోయిన్ గా అనుష్కను సంప్రదించినట్లుగా కూడా తెలుస్తోంది.కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ‘నేల టికెట్’ చిత్రంతో తీవ్రంగా నిరాశ పర్చిన కళ్యాణ్ కృష్ణకు నాగార్జున బంగార్రాజు ఛాన్స్ ఇవ్వడేమో అనుకున్నారు. కాని మంచి స్టోరీ లైన్ వినిపించడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అక్కినేని వర్గాల వారి నుండి సమాచారం అందుతుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి ప్రీక్వెల్ గా బంగార్రాజు కథను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. బంగార్రాజు చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అందులో ఒక హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేయాలని నాగార్జున ఆలోచనగా సమాచారం అందుతుంది.

తాజాగా నాగార్జున ‘దేవదాస్’ చిత్రాన్ని నానితో కలిసి చేయడం జరిగింది. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవదాస్ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. మరో వైపు ఒక హిందీ సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో నాగార్జున నటిస్తున్నాడు. ‘దేవదాస్’ విడుదలైన తర్వాత తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ధనుష్ మూవీలో నటించబోతున్నాడు. ధనుష్ తో మూవీ పూర్తి అయిన తర్వాత బంగార్రాజు పట్టాలెక్కే అవకాశం ఉంది.

మరో వైపు అనుష్క భాగమతి చిత్రం తర్వాత కనిపించకుండా పోయింది. ఇన్నాళ్లకు ఈమె తమిళంలో రెండు చిత్రాలు చేసేందుకు కమిట్ అయ్యింది. ఇక నాగార్జునతో నటించేందుకు కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. హిట్ పెయిర్ గా గుర్తింపు దక్కించుకున్న వీరిద్దరు మరోసారి జంటగా నటించాలని అభిమానులు ఆశపడుతున్నారు. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.