Begin typing your search above and press return to search.

డోనరుడు.. అక్కినేనిల తోడు..

By:  Tupaki Desk   |   27 Oct 2016 5:11 PM GMT
డోనరుడు.. అక్కినేనిల తోడు..
X
అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ నరుడా డోనరుడా. ఈ మూవీపై అమితమైన ఆసక్తితో తనే చొరవచూపి మరీ ఈ సినిమా చేసేశాడు సుమంత్. ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఎవరో కాదు.. అప్పట్లో పవన్ కళ్యాణ్ తో కలిసి అక్కడ అమ్మాయిగా అరంగేట్రం చేసిన సుప్రియ అలియాస్... సుమంత్ సిస్టర్. అయితే.. షూటింగ్ జరుగుతున్నపుడు పెద్దగా జనాలకు తెలీదు కానీ.. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. నరుడా డోనరుడా విపరీతమైన బజ్ క్రియేట్ చేసేయగా.. నవంబర్ 4న రిలీజ్ చేసేయనున్నారు కూడా.

సుమంత్.. పల్లవి సుభాష్ జంటగా నటించిన ఈ మూవీకి ఇప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి.. ఫాదర్ నాగార్జునతో పాటు అండ్ ఈ జనరేషన్ అక్కినేని హీరో అఖిల్ కూడా రావడం విశేషం. అక్కినేని హీరోలు ఇలా కలిసి కనిపించడం ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఇది తమ వంశం నుంచి వచ్చిన అందరు హీరోలకు ఎక్స్ టెండ్ చేస్తారనే ఇప్పుడు అందరికీ అర్ధమవుతోంది. నిజానికి.. సుమంత్ కోసం నాగార్జున గతంలో కూడా చాలానే కష్టపడ్డాడు. రామ్ గోపాల్ వర్మతో లాంఛ్ చేయించడంతో పాటు.. తన రేంజ్ తగ్గించుకుని మరీ స్నేహమంటే ఇదేరా మూవీ చేయడం లాంటివి చాలానే చేశాడు.

రీసెంట్ గా మాత్రం కెరీర్ లో బాగా స్లో అయిపోయిన సుమంత్.. ఇప్పుడు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయేందుకు ప్రయత్నిస్తుండగా.. దీనికి కూడా తన కొడుకు అఖిల్ తో కలిసి నాగార్జున సపోర్ట్ చేస్తుండడం విశేషం.