శాతకర్ణిపై నాగ్ ఏమన్నాడంటే..

Wed Jan 11 2017 18:25:04 GMT+0530 (IST)

విషయం తెలియదు కాని చాలా రోజుల నుండి.. అక్కినేని నాగార్జున అండ్ నందమూరి బాలకృష్ణ లో ఎందుకో మాట్లాడుకోవట్లేదనే టాక్ ఉంది. ఇటు అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్లలో బాలయ్య కనిపించకపోవడం.. అలాగే బాలయ్య ఈవెంట్స్ లో నాగ్ అండ్ కో మిస్సవడం.. చాలా రోజుల నుండి జరుగుతోంది. అందుకే వీరి మధ్యన ఏమైందా అని అందరూ ఎప్పుడూ ఆరా తీస్తూ ఉంటారు.

అదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు కింగ్ నాగార్జున మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ అవుతున్న వేళ.. ఆ సినిమా కోసం ఒక ట్వీట్ వేశారు. ''బాలయ్య.. క్రిష్ అండ్ టీమ్ కు.. ఆల్ ది బెస్ట్. నాకు హిస్టారికల్ సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టరీ క్రియేట్ చేయాలని అనుకుంటున్నా'' అంటూ ట్వీటేశారు నాగార్జున. ఇప్పటికే బాలయ్య సినిమాలపై ఎప్పుడూ ట్వీట్లు వేయని నాగ్ కూడా ట్వీట్ వేయడంతో.. ఖచ్చితంగా శాతకర్ణి చుట్టూ క్రేజ్ బాగా పెరిగిపోతోందంతే.

ఇకపోతే బుధవారం అంతా ఖైదీ నెం 150 మాయలో మునిగిపోయిన టాలీవుడ్.. ఇప్పుడు 12న శాతకర్ణి మత్తులోకి జారుకోవడానికి సిద్దపడుతోంది. సమయం దగ్గర పడుతోంది మిత్రమా.. త్వరగా సినిమా రిలీజ్ అయిపోగానే మనం బోలెడన్ని కబుర్లు చెప్పేసుకుందాం. రివ్యూ నుండి ఎనాలసిస్ వరకు.. క్యాచ్ ఇట్ ఆన్ తుపాకి.కామ్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/