నాగ్ కి కోపం వచ్చిందా?

Fri Oct 13 2017 17:58:27 GMT+0530 (IST)

సాదారణంగా ఇంటర్వ్యూలో స్టార్స్ చాలా నవ్వుతూ మాట్లాడతారు. ఒకవేళ యాంకర్స్ ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తే కొందరు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మరికొందరు అక్కడే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక కొందరు స్టార్స్ ఇంటర్వ్యూ మధ్యలో నుంచే వెళ్లిపోవడం చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో స్టార్స్ యాంగ్రీ మూమెంట్స్ ఇప్పటికి వైరల్ అవుతుంటాయి.అయితే రీసెంట్ గా నాగార్జున కూడా ఒక ఇంటర్వ్యూలో కొంచెం సీరియస్ అయినట్లు కనిపించింది. బట్ అప్పుడే స్మైల్ తో కవర్ చేశారు. కానీ ఆ ఇంటర్వ్యూ చూసిన వారు మాత్రం నాగ్ కి కొంచెం కోపం వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. రాజు గారి గది 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున - సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అయితే అందులో లేడి యాంకర్ నాగ్ గ్లామర్ గురించి ప్రస్తావిస్తూ.. మీసాలు ఎందుకు తీశారని అడిగింది. జస్ట్ ఊరికే అని నాగ్ చెప్పాడు. కానీ యాంకరమ్మ మీసాలు ఉంటే బాగుండేదని అనడం.. అలాగే మామయ్య అయ్యాక ఇంకా యంగ్ గా కనిపించేందుకు అలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పడంతో..నాగ్ ఏమన్నారంటే.. ''కొడలు పక్కనే ఉంది కొంచెం  'బీహేవ్ యూర్ సెల్ఫ్'' అంటూ గట్టిగా నవ్వేశారు. యాంకర్ తో పాటు పక్కన సమంత కూడా నవ్వేసింది.

కానీ నాగ్ కి మాత్రం కొంచెం కోపం వచ్చిందని ఇంటర్వ్యూ చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. ఇక రాజు గారి గది 2 సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. అది సంగతి.