Begin typing your search above and press return to search.

ఆ యాంగిల్ లో పవన్ కు నాగ్ సపోర్ట్

By:  Tupaki Desk   |   21 April 2018 4:49 AM GMT
ఆ యాంగిల్ లో పవన్ కు నాగ్ సపోర్ట్
X
తనపై రాజకీయ కుట్ర చేసే ఉద్దేశ్యంతో.. వ్యక్తిగత ఆరోపణలు చేయించడం.. అమ్మను తిట్టించడం.. ఇందుకోసం సినిమా ఇండస్ట్రీపై పరువు తీయడం వంటివి చేయడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫిలిం ఛాంబర్ కు కుటుంబంలోని హీరోలతో సహా వచ్చి ఏం చర్యలు తీసుకుంటున్నాడని డిమాండ్ చేశాడు.

పవన్ కళ్యాణ్ కు అభిమానుల నుంచి మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడా నాగార్జున కనిపించకపోవడం చాలామందికి ప్రశ్నార్ధకం అయింది. ప్రస్తుతం వర్మతో నాగార్జున సినిమా చేస్తున్నారు. ఆఫీసర్ అనే టైటిల్ పై రూపొందిన ఈ సినిమా వచ్చే నెల 25న విడుదల కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో అనవసరంగా రిస్క్ ఎందుకు అని నాగ్ ఫీలయినట్లు కథనాలు వస్తున్నాయి. కానీ నిజానికి పవన్ కు సపోర్ట్ ఇచ్చేందుకు నాగార్జున సిద్ధంగానే ఉన్నారు. తను నేరుగా రాకపోయినా.. తన మద్దతు పలికారు.

నిన్న పవన్ ఫిలిం ఛాంబర్ కు వచ్చిన సమయంలో.. అక్కడకు తన మేనకోడలు సుప్రియను పంపడం జరిగింది. ఆమె ఎక్కువ సేపే అక్కడ ఉండడం విశేషం. పవన్ తొలి సినిమాలో హీరోయిన్ సుప్రియే అని గుర్తుంచుకోవాలి. కానీ నేరుగా వివాదాల్లోకి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేకపోవడంతోనే నాగ్ రాలేదని టాక్.