Begin typing your search above and press return to search.

అఖిల్ లో ఏఎన్నార్ కనిపించారు -నాగార్జున

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:03 AM GMT
అఖిల్ లో ఏఎన్నార్ కనిపించారు -నాగార్జున
X
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సెకండ్ మూవీ హలో చిత్రానికి ఆడియో లాంఛ్ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. తుఫాన్ హెచ్చరికలు వచ్చినా.. ముందుగా అనుకున్నట్లుగానే అక్కడే ఈవెంట్ నిర్వహించారు నాగ్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన హలో చిత్ర నిర్మాత నాగార్జున మాటలు.. ఈ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచాయి.

'ఈ మూవీ ప్రారంభించినపుడే అఖిల్ రీలాంఛ్ అన్నాను. అఖిల్ కి పెద్ద సక్సెస్ ఇస్తానని ఏడాది క్రితం మీకు ప్రామిస్ చేశాను. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ నాగచైతన్యతో సినిమా చేస్తూ చెప్పాను. వస్తున్నాం కొడుతున్నాం అన్నాను. కొట్టాం. ఆ తర్వాత నుంచి అఖిల్ పనుల్లోనే ఉన్నాం. అఖిల్ కి ఎలాంటి సినిమా అనే విషయంపై చాలానే ఆలోచనలు చేశాను. అంతటి అనుభవం ఉన్న నాన్నగారని ఎలా సాగనంపాలో.. చివరి చిత్రం మనంతో అలాంటి సినిమానే ఇచ్చాడు విక్రమ్ కుమార్. ఇప్పుడు అఖిల్ ని నేను ఎలా చూడాలని అనుకున్నానో చెబితే హలో సినిమా రూపొందింది' అన్నారు నాగార్జున.

'మీరందరూ అఖిల్ ని ఎలా చూడాలని అనుకున్నారో అలా చూస్తారు. తెలుగు సినిమాకి డ్యాన్స్.. గ్రేస్ నేర్పిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇప్పుడు అఖిల్ లో ఆయన కనిపిస్తున్నాడు.

అప్పట్లో హలో గురూ ప్రేమ కోసమేరా అని ఏనుగు ఎక్కించి నాతో పాడిస్తూ.. నన్ను అమలతో కలిపారు ప్రియదర్శన్. ఇప్పుడు ఆయన కూతురు కళ్యాణి అఖిల్ మూవీలో నటించడం డెస్టినీ అనాల్సిందే. అలాగే వైజాగ్ లో ఆడియో ఫంక్షన్ వద్దు తుఫాన్ వస్తుందని అంతా చెబితే.. అన్నపూర్ణ టీం మాత్రం.. మీరెళ్లండి నాన్నగారు చూస్కుంటారు అన్నారు. వైజాగ్ తో కలవాలని డెస్టినీ ఉందో.. నాన్నగారు పై నుంచి చూస్కున్నారో తెలీదు కానీ ఈవెంట్ అద్భుతంగా జరిగింది' అంటూ ఎమోషనల్ అయ్యారు నాగ్.

'వైజాగ్ కి గంటా రమ్మంటున్నారు తప్పకుండా వస్తాం. గతంలో ఎన్నో మూవీస్ చేశాం. వైజాగ్ అంటే మాకు చాలా ఇష్టం. నా తొలి చిత్ర షూటింగ్ ఇక్కడే జరిగింది. కాకినాడ.. రాజమండ్రిలలో చాలా సినిమాలు చేశాం. మీరంత ప్రేమగా పిలిస్తే ఎందుకు రాం.. తప్పకుండా వస్తాం' అని చెప్పిన నాగార్జున.. 'ఈ నెల 22న వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం' అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.