Begin typing your search above and press return to search.

నాగార్జున మ‌రో పాట పాడాడు

By:  Tupaki Desk   |   23 July 2016 7:48 AM GMT
నాగార్జున మ‌రో పాట పాడాడు
X
హీరోలు పాట‌లు పాడ‌టం కొత్తేమీ కాదు. సంగీత ద‌ర్శ‌కుల బ‌లవంతం మేర‌కు కొన్నిసార్లు - కొత్త‌గా ట్రై చేద్దాం అని కొన్నిసార్లు - అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చ‌డానికని కొన్నిసార్లు సొంత గొంతుల్ని స‌వ‌రించుకొంటుంటారు హీరోలు. పాట పాడిన హీరోలు మ‌న ఇండ‌స్ట్రీలోచాలామందే ఉన్నారు. అక్కినేని నాగార్జున కూడా సీతారామ‌రాజు సినిమాకోసం వినుడు వినుడు ఈ సిగ‌రెట్ గాథా... అంటూ ఓ పాట పాడాడు నాగార్జున‌. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న పాట‌ల జోలికి వెళ్ల‌లేదెందుకో.

చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ తానే సొంతంగా నిర్మిస్తున్న నిర్మ‌లా కాన్వెంట్ కోసం గొంతును స‌వ‌రించుకొన్నాడు నాగార్జున‌. ఓ ఊపొచ్చే పాట‌ని పాడేశాడ‌ట‌. ఆ పాట‌ని ఈ రోజు సాయంత్ర‌మే విడుద‌ల చేయ‌బోతున్నారు. శ్రీకాంత్ కొడుకు రోష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం నిర్మ‌లా కాన్వెంట్‌. ఉయ్యాలా జంపాలా త‌ర్వాత మ‌ళ్లీ ఆ త‌ర‌హాలో నాగార్జున ఎంతో ఇష్ట‌ప‌డి చేసిన చిన్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో నాగ్ ఓ కీల‌క పాత్ర‌లో కూడా క‌నిపించ‌బోతున్నాడు. తాజాగా ఓ పాట కూడా పాడాడు.

సినిమాని ప్ర‌మోట్ చేయ‌డంలో ముందుండే నాగార్జున నిర్మ‌లా కాన్వెంట్‌ కి కూడా కావ‌ల్సినంత హైప్ తీసుకొచ్చిన‌ట్టైంది. ఇప్ప‌టికే భారీ స్థాయిలో ప‌బ్లిసిటీ చేశారు. ఇక నాగార్జున పాట‌తో ప్ర‌మోష‌న్ మ‌రో రేంజ్‌ కి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు. ఇక సినిమా ఏ మాత్రం బాగున్నా సూప‌ర్ హిట్టు గ్యారెంటీనే అని ప‌రిశ్ర‌మ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.