Begin typing your search above and press return to search.

కోడలుపిల్ల దిగులు మామగారి భరోసా

By:  Tupaki Desk   |   21 Sep 2018 8:49 AM GMT
కోడలుపిల్ల దిగులు మామగారి భరోసా
X
రివ్యూల వల్ల సినిమా హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందా? అనేది నెవర్ ఎండింగ్ డిబేట్. హిట్.. ఫ్లాపులను డిసైడ్ చేసేది సినిమా కంటెంట్ మాత్రమేనని కొందరంటే.. లేదు రివ్యూల వల్ల సినిమా రిజల్ట్ పై కొంతమేర ప్రభావం ఉంటుందని కొందరు అంటారు. ఇక ఈ అభిప్రాయాల సంగతేమో గానీ రివ్యూలను మాత్రం దాదాపు అందరు సెలబ్రిటీలు చదువుతున్నారు అన్నది వాస్తవం. ఇక రీసెంట్ గా రివ్యూలు కలెక్షన్స్ గురించి కోడలుపిల్ల సమంతా టెన్షన్ పడుతుంటే ఎలా ధైర్యం చెప్పాడో అక్కినేని నాగార్జున చెప్పుకొచ్చారు.

నిన్న 'దేవదాస్' ఆడియో ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ భార్య భార్తలయిన చైతు-సమంతా సినిమాలు ఒకేరోజు విడుదల కావడం ఒక రికార్డు లాంటిదని.. ఇలాంటిది ఎక్కడా జరిగి ఉండదని చెప్పాడు. ఇక రిలీజ్ రోజు 'శైలజారెడ్డి అల్లుడు' రివ్యూస్ చూసి దిగులుతో 'మామా రివ్యూస్ ఇలా ఉన్నాయి ఏంటి?' అని అడిగిందట. నాగార్జున 'ఏం వర్రీ అవ్వకు సాయంత్రానికి అంతా సెట్ అవుతుంది' అన్నాడట. ఇక 'U టర్న్' గురించి సమంతాది మరో రకమైన దిగులట.. 'మామా రివ్యూస్ సూపర్ గా ఉన్నాయి గానీ కలెక్షన్స్ గొప్పగా లేవు' అని తన మనసులోని మాట చెప్పుకుందట. ఇక దానికి సమాధానంగా 'అన్నీ ఆదివారానికి సెట్ అవుతాయి చూడు' అన్నాడట.

చెప్పినట్టే రెండు సినిమాలకు ప్రేక్షకుల నుండి ఆదరణ దక్కిందని రెండూ విజయం సాధించడం తమకు సంతోషాన్నిచ్చిందని నాగార్జున సంతోషంగా చెప్పాడు. ఇక ఈ సెప్టెంబర్ నెల అక్కినేనివారిదని చెప్పాడు. తమకు ప్రత్యేకమైనదని చైతు.. సామ్ ల సినిమాలతో పాటు తన 'దేవదాస్' కూడా విడుదల కానుందని.. వీటితో పాటుగా నాన్నగారి జయంతి నాడు 'దేవదాస్' ఆడియో ఈవెంట్ జరుపుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపాడు.