Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ గదిలోకి ఎవ్వరూ రావ్వట్లేదేంటో

By:  Tupaki Desk   |   16 Oct 2017 8:43 AM GMT
ఓవర్సీస్ గదిలోకి ఎవ్వరూ రావ్వట్లేదేంటో
X
ఈ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున కూడా మంచి కంటెంట్ తో సినిమాలు తీయడంతో.. ఆ సినిమాలకు ఓవర్సీస్ లో కూడా బాగానే ఆదరణ ఉంటోంది. ఇకపోతే 'రాజు గారి గది 2' సినిమాకు రివ్యూలు యావరేజ్ గా వచ్చినా కూడా కలక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోతున్నాయి అంటూ టీమ్ చెబుతున్నారు. నిజానికి అవి పర్లేదనిపించే కలక్షన్లేలే. అయితే అమెరికాలో మాత్రం అసలు సీన్ కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది.

అసలు మనం అండ్ ఊపిరి సినిమాలకు ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ వసూళ్ళు వచ్చేశాయి కాబట్టి.. దాదాపు నాగార్జున చేసే ప్రతీ సినిమాకూ అలాగే వస్తుందని అనుకున్నారు. ఇక సమంతకు కూడా ఓవర్సీస్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి.. ఆమె ప్రెజన్స్ అనేది రాజు గారి గది 2 సినిమాకు చాలా ఉపయోగం అనుకున్నారు. కాని కట్ చేస్తే.. తొలి వీకెండ్లో రాజు గారి గది 2 కేవలం 275000 డాలర్ల సుమారు మాత్రమే వసూలు చేసింది. ఈ రేంజులో వెళితే అసలు అర మిలియన్ కూడా వసూలు చేయడం కష్టమే. అంటే సినిమా అక్కడి ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఇవ్వలేదని అర్ధంచేసుకోవచ్చు.

ముఖ్యంగా ఓవర్సీస్ లో సినిమా సరిగ్గా ఎక్కకపోవడానికి అక్కడ ప్రమోషన్లను కూడా ఏమీ చేయలేదు అంటున్నారు సినిమా వర్గాలు. ఇక ప్రమోషన్ ఎలా ఉన్నప్పటికీ కంటెంట్ ఎక్కకపోతే సినిమాను చూడ్డానికి అక్కడ ఎన్ని ఆఫర్లు పెట్టినా కూడా జనాలు ఎగబడరు. ఈ గది విషయంలో అదే జరిగినట్లుంది.