Begin typing your search above and press return to search.

దీపావళికి నాగ్ దెయ్యం సినిమా

By:  Tupaki Desk   |   23 July 2017 5:02 AM GMT
దీపావళికి నాగ్ దెయ్యం సినిమా
X
నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఓం నమో వెంకటేశాయ అంటూ దర్శకేంద్రుడు రూపొందిచిన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్. అయితే.. ఆ సినిమాకి టాక్ బాగున్నా.. వసూళ్లు మాత్రం చాలా దారుణంగా వచ్చాయి. కమర్షియల్ గా ఆ చిత్రం ఫ్లాప్ గా నిలిచిన తర్వాత.. నాగ్ ఇప్పుడు ఓ దెయ్యం సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.

ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజు గారి గది చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన రాజుగారి గది2లో నటిస్తున్నారు నాగ్. సీరత్ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా.. అక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత ఓ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి షూటింగ్ పార్ట్ పూర్తయిపోగా.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందీ చిత్రం. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి.. అక్టోబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్ణయించారట. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ ఆగస్ట్ నెలాఖరుకే పూర్తి కానున్నా.. రిలీజ్ డేట్ విషయంలో ప్లాన్డ్ గా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు నాగ్ టీం.

సెప్టెంబర్ అంతా పెద్ద సినిమాల హంగామా ఉండడంతో.. అక్టోబర్ లో దీపావళి పండుగకు ముందు వీకెండ్ కి ఫిక్స్ అయ్యారు రాజుగారి గది2 యూనిట్. సమంత ఈ చిత్రంలో దెయ్యంగా కనిపించనుందనే టాక్ ఉండగా.. మానసిక శక్తులను ప్రదర్శించే ఓ మాంత్రికుడి పాత్రలో నాగ్ కనిపిస్తారని ఇప్పటికే చెప్పేశారు.