Begin typing your search above and press return to search.

అలా కూడా సక్సెస్ అయ్యాడుగా..

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:48 AM GMT
అలా కూడా సక్సెస్ అయ్యాడుగా..
X
ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా జనాల వరకు వెళ్లాలంటే ప్రమోషన్స్ తప్పకుండా అవసరం. ఎంత చిన్న బడ్జెట్ తో తెరకెక్కుతున్న సరే ప్రమోషన్స్ కి మాత్రం అస్సలు వెనుకడుగు వెయ్యడం లేదు సినిమా వాళ్ళు. ఎందుకంటే కంటెంట్ ఉన్న చిత్రాలు కూడా ఒక్కోసారి ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం వల్లే ప్లాప్ అవుతుంటాయి. అందుకే ఈ సారి నాగార్జున కూడా పీఆర్ ఓగా అవతారం ఎత్తాడు. అది కూడా ఆయన సినిమాకి కాదు. తన రెండవ కుమారుడైన అఖిల్ సినిమా కోసం.

ఇప్పటికే తన పెద్ద కుమారుడి "రారొండోయ్ వేడుక చూద్దాం" సినిమాలకు దగ్గరుండి తన హోమ్ బ్యానర్ లో నిర్మించి ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తీసుకొని ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. సోషల్ మీడియాలో - ప్రెస్ మీట్స్ తో కలిసి సినిమాకు హైప్ ని తెచ్చి చైతూకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు నాగ్. ఇప్పుడు అదే తరహాలో అఖిల్ సీనిమాకు ఒక స్పెషల్ పిఆర్ ఓ గా తన శక్తికి మించి కష్టపడుతున్నాడు నాగ్. మొదటి సినిమాతో ఊహించని ఎదురుదెబ్బను తిన్న అఖిల్ రెండవ సినిమా సక్సెస్ కోసం మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. నాగార్జున కూడా అఖిల్ సినిమాకు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేస్తున్నాడు. ఇప్పటికే పాటలో టైటిల్ ఉందంటూ జనాలకు ఓ పజిల్ ని వదిలి వారిచేత "హలో" అనిపించి అదే టైటిల్ అని చెప్పేశాడు. ఇదంతా బాగానే ఆకట్టుకోంది. సినిమా కోసం ఇదే తరహాలో ప్రచారం చేస్తే.. హైప్ ఆటోమ్యాటిక్ గా వస్తుంది.

ఈ సినిమాను కూడా నాగార్జున తనే నిర్మిస్తున్నాడు. మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకున్నాడు అఖిల్. అలాగే అక్కినేని ఫ్యామిలీ కూడా అఖిల్ సినిమా కోసం ఎవరి స్టైల్ లో వారు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. చూడాలి మరి అక్కినేని పిఆర్ ఓ టీమ్ వర్క్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో..