Begin typing your search above and press return to search.

సవ్యసాచికి సీనియర్ సామ్రాట్ ప్రశంసలు

By:  Tupaki Desk   |   17 March 2018 4:08 AM GMT
సవ్యసాచికి సీనియర్ సామ్రాట్ ప్రశంసలు
X
ఒక పోస్టర్ బాగుందంటే.. ఒక టీజర్ అదిరిందంటే.. ఒక ట్రైలర్ ఆకట్టుకుందంటే.. ఖచ్చితంగా దానికి నలువైపుల నుండీ పొగడ్తల వాన కురవక మానదు. నవ యువ సామ్రాట్ అనిపించుకుంటూ.. తన మార్కెట్ ను మరింత పటిష్టం చేసుకుందామనే ప్లాన్ తో .. వినూత్నమైన సినిమాతో మన ముందుకు వస్తున్న నాగ చైతన్య కూడా ఇప్పుడు తన ఫస్ట్ పంచ్ విషయంలో ఇటువంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నాడు.

చందు మొండేటి డైరక్షన్లో 'సవ్యసాచి' అంటూ వస్తున్నాడు చైతూ. ఈ సినిమా ఫస్ట్ పంచ్.. అదేనండీ ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్ననే విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా విడుదలైందో లేదో అందరికీ అలా నచ్చేసింది. స్వయంగా సీనియర్ సామ్రాట్ అయిన కింగ్ నాగ్ కూడా మెచ్చుకున్నారు. లుకింగ్ సూపర్ అంటూ పొగిడేశారు. ఇక విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా.. వావ్.. కిల్లర్ లుక్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. నిజానికి తన సొంత సినిమాలను కూడా నచ్చకపోతే సరిగా ప్రమోట్ చేయని నాగ్.. ఇప్పుడు అంతలా నచ్చేబట్టే ఈ సినిమా పోస్టర్ పై కామెంట్ చేశారని అభిమానులు అనందపడుతున్నారు.

సవ్యసాచి సినిమాలో నాగచైతన్య సరసన కొత్తమ్మాయ్ నిధి అగర్వాల్ నటిస్తుండగా.. మాధవన్ తొలిసారిగా డైరక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. కాకపోతే ఈ సీనియర్ లవర్ బాయ్ జూనియర్ లవర్ బాయ్ ప్రక్కన విలన్ గా చేస్తున్నారు. అలాగే మాజీ హీరోయిన్ భూమిక హీరో అక్క పాత్రలో కనిపించనుంది. అది సంగతి.