Begin typing your search above and press return to search.

నవ మన్మథుడికి పోస్టల్ బర్త్ డే గిఫ్ట్

By:  Tupaki Desk   |   29 Aug 2016 4:46 AM GMT
నవ మన్మథుడికి పోస్టల్ బర్త్ డే గిఫ్ట్
X
ఆగస్ట్ 29 అంటే.. అక్కినేని అభిమానులకు పెద్ద పండగ. ఆ రోజున అక్కినేని నాగార్జున బర్త్ డే కావడమే ఇందుకు కారణం. ఈ రోజు నాగ్ 57 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ టాలీవుడ్ మన్మథుడిని చూసిన తర్వాత 57 ఏళ్ల రాకుమారుడు అంటే ఎవరికైనా నమ్మడం కష్టమే. అయితే.. ఈసారి నాగ్ పుట్టిన రోజుకు మరో ప్రత్యేకత కూడా సంతరించుకోనుంది.

పోస్టల్ శాఖ ఈసారి నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రత్యేకమైన పోస్టల్ స్టాంప్ సిరీస్ ను లాంఛ్ చేసింది. ఒకవైపు తాజ్ మహల్.. మరో వైపు నాగార్జును చూపిస్తూ.. ప్రత్యేక ఎడిషన్ పోస్టల్ స్టాంపులు మార్కెట్ లోకి రానున్నాయి. నాగ్ నటించిన పలు సినిమాల్లోని నాగార్జున వివిధ గెటప్ లు ఈ స్టాంపులపై దర్శనం ఇవ్వనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ ఫోటోను అన్నపూర్ణ స్టూడియోస్ అభిమానులకు చూపిచింది.

ఈ సిరీస్ మొత్తంలో ఒకవైపు ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్.. మరోవైపు నాగార్జున కనిపించనుండడం విశేషం. తమ హీరో ఈ అత్యద్భుతమైన ఫీట్ సాధించడంతో.. నాగ్ అభిమానులు ఇప్పుడు భలే ఖుషీ అయిపోతున్నారు.