నాగ్ దగ్గర భలే క్లారిటీ ఉంటుంది

Thu Jun 21 2018 16:26:54 GMT+0530 (IST)

అక్కినేని నాగార్జున కొంతకాలంగా ఏదంటే అదే జరుగుతోంది. కొడుతున్నాం అనే మాట ఆయన వాడారంటే మాత్రం.. నిజంగానే బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నారు. హలో విషయంలో ఇది తప్పి ఉండొచ్చు కానీ.. రీసెంట్ గా వచ్చిన ఆఫీసర్ ప్రచారంలో ఎక్కడా ఈ మాట అసలు ఉపయోగించనే లేదని గుర్తుంచుకోవాలి. వర్మపై నమ్మకం ఉందని ఒకటికి నాలుగు సార్లు చెప్పడం ద్వారా.. హిట్టు-ఫట్టు రెండు క్రెడిట్లు వర్మకే అప్పగించేశారు.చివరకు సినిమా రిజల్ట్ సంగతి తెలిసిందే. ఇప్పుడు నానితో కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తున్నారు నాగార్జున. తాను ఈ మూవీలో ఓ డాన్ గా నటిస్తున్నాననని.. తనకు వైద్యం చేసే డాక్టర్ గా నాని యాక్ట్ చేస్తున్నాడని చెప్పిన నాగ్.. ఈ మూవీ రాజ్ కుమార్ హిరాణీ స్టైల్ లో ఉంటుందని చెప్పడం మాత్రం హైలైట్. అంత సున్నితమైన సునిశితమైన హాస్యాన్ని అందిస్తున్న శ్రీరాం ఆదిత్యను అభినందించారాయన. తనకు కెరీర్ ప్రారంభంలో సోలో హీరోగా అవకాశాలు వచ్చాయని అందుకే అవే చేశానని చెప్పిన నాగ్.. మల్టీస్టారర్ ల కారణంగా తన ఇమేజ్ తగ్గిపోతుందనే ఫీలింగ్ లేదని అన్నారు.

గతంలో కార్తీతో ఊపిరి.. ఇప్పుడు నానితో ఓ సినిమా మాత్రమే కాదు.. చైతు- అఖిల్ లలో కలిసి పని చేసేందుకు కూడా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు నాగ్. 16వ శతాబ్దానికి చెందిన కుంజలి మరక్కర్-4 అనే నవలా పరిశోధకుడి ఆధారంగా 'మక్కర్ ద లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' అనే చిత్రం కోసం తనను సంప్రదించిన మాట నిజమే అయినా.. జూన్ నెల చివరకు కథ విన్న తర్వాతే తాను నటిస్తానో లేదో చెబ్తానని అన్నారు నాగార్జున.