Begin typing your search above and press return to search.

అన్నీ తెలిసే నాగ్ సైలెంటా??

By:  Tupaki Desk   |   17 Jan 2018 6:49 AM GMT
అన్నీ తెలిసే నాగ్ సైలెంటా??
X
అసలు నాగార్జున విషయంలో కొన్ని లెక్కలు కరక్టుగా ఉంటాయి. అవేంటంటే.. సినిమా బాగుంటేనే ఆయన ప్రమోట్ చేస్తాడు. లేదంటే ఆయన సైలెంట్ అయిపోతాడు. ఆయన ప్రమోషన్ల ను సరిగ్గా చేయట్లేదు అంటే మాత్రం.. సినిమా నచ్చలేదనే అనుకోవాలి. కేవలం రెండు ప్రెస్ మీట్లతో ఆయన ప్రమోషన్ కార్యక్రమం ముగించారంటే.. అక్కడే మనం అర్దం చేసుకోవాలి అంటున్నారు సినిమా విశ్లేషకులు.

గతంలో కొన్ని సినిమాల విషయం పరిశీలిస్తే.. ఊపిరి సినిమా అప్పుడు నాగ్ అంతగా ప్రమోషన్లలో పాల్గొనలేదు. అదేంటి సినిమా సూపర్ కదా అని అందరూ అనుకున్నారు కాని.. 60 కోట్ల సినిమాకు అనుకున్నంత రేంజులో రిజల్ట్ రాలేదనే చెప్పాలి. తెలుగు అండ్ తమిళ కలిపితే లాస్ లేదు కాని.. సినిమాకు బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకోలేకపోయింది. అదే విధంగా రాజు గారి గది 2 సినిమాకు ఓ రెండు ప్రెస్ మీట్లు పెట్టేసి ముగించారు. ఆ సినిమా రిజల్ట్ కూడా మనకు తెలిసిందే. హలో సినిమాను మాత్రం నాగ్ తెగ ప్రమోట్ చేస్తున్నప్పుడే కాస్త అర్ధమైంది.. ఏంటి సినిమా ఏదన్నా తేడా కొట్టిందా అని. చివరకు సినిమా మాస్ కు ఎక్కలేదు. కట్ చేస్తే రంగులరాట్నం సినిమాను ప్రొడ్యూస్ చేసిన నాగ్.. ఒక్క ప్రెస్ మీట్ తో ప్రమోట్ చేసినప్పుడే అర్ధమైంది.. ఏదో తేడా పడబోతోంది అని. చివరకు సినిమా రిజల్ట్ ఏంటో మనం చూశాం.

కాకపోతే సినిమా తీసి.. దానిని రిలీజ్ చేసే టైములో.. కాస్త అదనంగా ప్రమోట్ చేస్తే గట్టి ఓపెనింగులు వస్తాయి. మనకు ఎలాగో రిజల్ట్ తెలుసు కదా అని ప్రమోట్ చేయకపోతే లాస్ ఎక్కువగా ఉంటుంది. మరి నాగ్ ఆ విషయంలో ఎందుకు సంశయిస్తున్నారో ఏంటో.