నాగ్ బాబా అక్కడికి వెళుతున్నాడు

Sat Aug 12 2017 12:16:46 GMT+0530 (IST)

హీరోలు ఎన్ని సినిమాలు తీసినా వారి జీవితంలో సంతృప్తినిచ్చిన సినిమాలు కొన్నే ఉంటాయి. నటుడిగా నిరూపించుకోవడానికి వారు చేసే ప్రయోగాలు వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అటువంటి వారిలో నాగార్జునా ఒకరు. ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పటివరకు నటుడిగా తనను తాను పూర్తిగా నిరూపించుకున్న నటుడు నాగార్జున. ముఖ్యంగా అన్నమయ్య వంటి సినిమాలలో ఆయన నటించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.అందుకు రాఘవేంద్ర రావు లాంటి దర్శకత్వం చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత వచ్చిన శ్రీ రామదాసు- షిర్డీ సాయి కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే మరో సారి రాఘవేంద్ర రావుతో కలిసి నాగార్జున చేసిన "ఓ నమో వెంకటేశాయ" మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నటన అందులో ఆయన హతి రామ్ బాబాగా చేసిన పాత్ర అందరిని ఆకట్టుకుంది.  నాగార్జున మరో సారి తానేంటో నిరూపించుకున్నాడు. ఓ వైపు యాక్షన్ తరహా సినిమాలు చేస్తూనే ఆలాంటి ప్రయోగాలను చేసిన మన్మధుడు. ఇప్పుడు ఆ సినిమాను తమిళ్ లో డబ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో అనుష్క కూడా కీలకమైన పాత్ర చేసింది. అలాగే నాగార్జునకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది.

బాబా హతి రామ్ జీవిత చరిత్ర తమిళ్ ప్రజలకు కూడా బాగా తెలుసు. అంతే కాకుండా అక్కడి ప్రజలు వెంకన్న స్వామికి భక్తులు కూడా దీంతో ఆ సినిమాను అక్కడ రిలీజ్ చేయాలని ఓ నిర్మాత ఆలోచిస్తున్నారట. ఇప్పటికే గగనం ఊపిరి సినిమాతో తమిళ ప్రజలకు బాగా సుపరిచితుడైన నాగార్జున ఈ సినిమాతో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.